హైదరాబాద్ సైబర్ టవర్స్ రజతోత్సవం సందర్భంగా CBN గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ గచ్చిబౌలి స్టేడియంలో వేలాదిమంది చంద్రబాబు అభిమానుల సాక్షిగా నిర్వహించారు. వేలాదిగా తరలి వచ్చిన చంద్రబాబు అభిమానులు జై చంద్రబాబు, జై బాబు అంటూ నినాదాలు చేస్తుండగా.. స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటుగా నందమూరి ఫ్యామిలీ మెంబెర్స్, బాలయ్య భార్య వసుంధర. ఆయన చిన్న కుమార్తె తేజస్విని హాజరయ్యారు. అలాగే బోయపాటి, బండ్ల గణేష్ , రఘురామ కృష్ణం రాజు పాల్గొన్నారు. అక్కడ స్టేడియంలో ఒక సమయంలో లైట్స్ హాఫ్ చేసి సెల్ ఫోనెలైట్స్ తో చంద్రబాబుకి సపోర్ట్ తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు.
అయితే ఈ కార్యక్రమంలో బండ్ల గణేష్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ఇప్పటికే బండ్ల గణేష్ సిటీస్ లో చంద్రబాబు కి సపోర్ట్ గా ర్యాలీలు చెయ్యడం కాదు.. పుట్టిన ఊర్లకి వెళ్లి అందరూ రచ్చబండ దగ్గర ధర్నాలు చేస్తూ చంద్రాబుబుకీ మద్దతునివ్వండి, ఆయన వలన ఎంతోమంది లాభపడ్డారు అని మాట్లాడిన బండ్ల గణేష్ ఈ రోజు ఈ కార్యక్రమంలో తాను చంద్రబబు జైల్లో ఉన్నందున వినాయకచవితి, దసరా పండగలు చేసుకోలేదు, ఆయన బయిటకి వచ్చాక దివాళి పండగని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటాను అంటూ ఎమోషనల్ అయ్యాడు.
ఐటి ఉద్యోగులకి జీవితాలు ఇచ్చిన ఘనత చంద్రబాబుదే, చంద్రబాబు జైల్లో ఉండడం చూసి కన్నీళ్ళు ఆగడం లేదు, తెలుగు వాడిగా పుట్టడమే చంద్రబాబు చేసిన తప్పా, చంద్రబాబు వలనే పల్లెవాసులు కూడా అమెరికా వెళుతున్నారు, చంద్రబాబు అనేది ఒక పేరు కాదు ఒక బ్రాండ్.. అంటూ బండ్ల గణేష్ ఎమోషనల్ స్పీచ్ అక్కడున్నవారు కొందరికి కన్నీళ్లు తెప్పించింది. ప్రస్తుతం గచ్చిబౌలి స్టేడియం చంద్రబాబు, టీడీపీ అభిమానులతో మొత్తం జనసంద్రమైంది.