Advertisement
Google Ads BL

అలా ఆలోచించేవాడితోనే పెళ్లి: నిత్యా మీనన్


కొద్దిరోజులుగా హీరోయిన్ నిత్యా మీనన్ పెళ్లిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. నిత్యా మీనన్ ప్రేమించినవాడినే వివాహం చేసుకోబోతుంది, అది మలయాళ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితో త్వరలోనే ఆమె పెళ్లి.. అంటూ ప్రచారం జరగడం వాటిని నిత్యా మీనన్ ఖండించడం చూస్తున్నాం. తాజాగా మరోసారి నిత్యా మీనన్ పెళ్లి మేటర్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ప్రస్తుతం నిత్యా మీనన్ ఓటిటి ప్రాజెక్ట్స్‌తో బిజీగా కనిపిస్తుంది. 

Advertisement
CJ Advs

అయితే ఓ భేటీలో నిత్యా మీనన్ పెళ్లిపై తన మనసులో మాట చెప్పింది. నేను పక్కా ట్రెడిషనల్, మన సంసృతిని చాలా గౌరవిస్తాను. నాకు పెళ్లిపై చాలా క్లారిటీ ఉంది. స్థిరమైన ఆలోచనలున్నాయి. పెళ్లి అనేది ఫైనాన్షియల్, సెక్యూరిటీ, సోషల్‌తో సంబంధం ఉన్న మేటర్. కానీ నాకు అలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. ఎవరైనా ఇలాంటి వాటిని మించి అంటే సోషల్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీకి మించి ఆలోచించేవారు ఎవరైనా దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అంటూ ఓ ఇంటర్వ్యూలో నిత్యా మీనన్ పెళ్లిపై తన ఆలోచనలు బయటపెట్టింది.

ఆమె పెళ్లిపై తన నిర్ణయాన్ని చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె నిర్ణయం చాలా బాగుందంటూ.. కొందరు నెటిజన్లు కితాబిస్తుంటే.. మరికొందరు నెగిటివ్‌గానూ కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం.. నిత్యాకి ఎలాంటి వాడు రాబోతున్నాడో..

Nithya Menen about Marriage:

Nithya Menen Comments on Marriage goes Viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs