Advertisement
Google Ads BL

దీనికి కారణం నేనే అంటున్నారు: దర్శకుడు


సిద్దార్థ్-అదితి రావు ఇప్పుడు లవ్ బర్డ్స్ గా ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తున్నారు. త్వరలోనే సిద్దార్థ్-అదితి రావు లు పెళ్లి చేసుకోబోతున్నారని అంటున్నారు కానీ.. ఈ కపుల్ మాత్రం ఎక్కడా ఓపెన్ అవ్వడం లేదు. ఎమన్నా అడిగితే అది మా పర్సనల్ విషయమంటారు. కొద్దిరోజులుగా వీరిద్దరూ ఎక్కువగానే మీడియాకి దొరుకుతున్నారు. అయితే సిద్దార్థ్-అదితి రావు లు ఇంతిలా ప్రేమలో పడడానికి కారణం అజయ్ భూపతి తెరకెక్కించిన మహాసముద్రం సెట్స్ అంటూ ఉంటారు. ఆ సినిమాలో శర్వానంద్ కి పెయిర్ గా అదితి కనిపించింది. ఆ సినిమా సెట్స్ లోనే సిద్దార్థ్ - అదితిలు ప్రేమలో పడ్డారని బయట ప్రచారం జరుగుతుంది. 

Advertisement
CJ Advs

మొన్నామధ్యన అన్ స్టాపబుల్ షోలో కూడా బాలయ్య శర్వానంద్ ని అదే అడిగారు. నాకు తెలియదు సర్ అంటూ శర్వా తప్పించుకున్నాడు. అయితే ఇప్పుడు అజయ్ భూపతి మంగళవారం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు. తాజాగా ఆయన అదితి బర్త్ డే రోజున ఓ పిక్ ని షేర్ చేస్తూ దీనికి కారణం నేనే అంటున్నారు.. అసలు ఏం జరుగుతుంది అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఆ పిక్ లో సిద్దార్థ్-అదితి రావు లు క్లోజ్ గా ఉన్న పిక్ ని షేర్ చేస్తూ అజయ్ భూపతి ఆ క్యాప్షన్ పెట్టాడు.

మరి అజయ్ భూపతి మహాసముద్రం తీసాను, ఆ సెట్స్ లోనే సిద్దార్థ్-అదితిలు లవ్ లో పడ్డారని చెప్పుకుంటున్నారు, అంటే వారి మధ్యలో ప్రేమ పుట్టడానికి నేనే ఇండైరెక్ట్ గా కారణమయ్యామని అందరూ చెప్పుకుంటున్నారు. మీరూ ఇదే నిజమంటారా అని అజయ్ ఆ క్యూట్ కపుల్ ని అడిగినట్లుగా ఉంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Siddharth calls Aditi his partner in a wholesome birthday post:

Siddharth and Aditi Rao Hydari pose adorably
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs