తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. ఈ రెండో జాబితా విషయంలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేసినట్టుగా కనిపిస్తోంది. ఎలాంటి మొహమాటాలకు తావివ్వకుండా జాబితాను రూపొందించింది. సర్వేలను పూర్తిగా పరిగణలోకి తీసుకుని సీనియారిటీని పక్కనబెట్టేసింది. ఈ క్రమంలోనే కొన్ని సంచలనాలకు తెరదీసింది. టికెట్ రావొచ్చని భావించిన వారికి మొండి చేయి చూపించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిని సైతం ఖాతరు చేయకుండా టికెట్లను కేటాయించడం గమనార్హం. బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన రేఖా నాయక్‌కు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించలేదు.
తొలిసారిగా బరిలోకి..
ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పాలేరు.. తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం టికెట్‌ను కేటాయించింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ వంగత నేత పీజేఆర్ తనయుడు విష్ణు వర్ధన్ రెడ్డికి కేటాయిస్తుందనుకుంటే.. మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కి కేటాయించి షాక్ ఇచ్చింది. అలాగే ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెలకు టికెట్ లభించింది. ఆమె కంటోన్మెంట్ నుంచి తొలిసారిగా బరిలోకి దిగబోతున్నారు. అలాగే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు స్థానాన్ని కేటాయించింది. ఖానాపూర్ టికెట్ ఆశించిన రేఖా నాయక్‌కు కాంగ్రెస్ పార్టీలో నిరాశే ఎదురైంది. ఇక్కడి టికెట్‌ను అధిష్టానం వెడ్మ బొజ్జుకు కేటాయించింది.
కాంగ్రెస్ రెండో జాబితా..
సిర్పూర్ కాగజ్‌నగర్ – రావి శ్రీనివాస్, ఆసిఫాబాద్- అజ్మీరా శ్యామ్, ఖానాపూర్ – వెడ్మ బొజ్జు, ఆదిలాబాద్ – కంది శ్రీనివాస్ రెడ్డి, బోధ్ – అశోక్, ముధోల్ – నారాయణరావు పాటిల్, ఎల్లారెడ్డి – మదన్ మోహన్ రావు, నిజామాబాద్ రూరల్ – భూపతి రెడ్డి, కోరుట్ల – జువ్వాడి నర్సింగ రావు, చొప్పదండి – మేడిపల్లి సత్యం, హుజురాబాద్ – వొడితల ప్రణవ్, హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్, సిద్ధిపేట – పూజల హరికృష్ణ, నర్సాపూర్ – ఆవుల రాజిరెడ్డి, దుబ్బాక – చెరుకు శ్రీనివాస్ రెడ్డి, కూకట్‌పల్లి – బండి రమేష్, ఇబ్రహీంపట్నం – మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎల్బీనగర్ – మధు యాష్కీ గౌడ్, మహేశ్వరం – కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, రాజేంద్రనగర్ – కస్తూరి నరేందర్, శేరిలింగంపల్లి – జగదీష్ గౌడ్, తాండూరు – బీ. మనోహర్ రెడ్డి, అంబర్‌పేట్ – రోహిన్ రెడ్డి, ఖైరతాబాద్ – విజయారెడ్డి, జూబ్లీహిల్స్ – అజారుద్దీన్, కంటోన్మెంట్ (ఎస్సీ) – డా.జి.వి.వెన్నెల (గద్దర్ కూతురు), నారాయణపేట్ – పర్ణిక చిట్టెం రెడ్డి, మహబూబ్‌నగర్ – యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల – అనిరుధ్ రెడ్డి, దేవరకద్ర – మధుసూధన్ రెడ్డి, మక్తల్ – వాకిటి శ్రీహరి, వనపర్తి – చిన్నా రెడ్డి, దేవరకొండ – బాలూ నాయక్, మునుగోడు – రాజగోపాల్ రెడ్డి, భువనగిరి – కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జనగాం – కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, పాలకుర్తి – యశస్వినీ మామిడిల్లా, మహబూబాబాద్ – మురళీ నాయక్, పరకాల – రేవూరి ప్రకాశ్ రెడ్డి, వరంగల్ వెస్ట్ – నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఈస్ట్ – కొండా సురేఖ, వర్ధన్నపేట – కేఆర్ నాగరాజు, పినపాక – పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మం – తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.