మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న గుంటూరు కారం షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. డిసెంబర్ కల్లా గుంటూరు కారం షూటింగ్ పూర్తి చేయాలన్నది త్రివిక్రమ్ టార్గెట్. తాజాగా మహేష్ బాబు పై గుంటూరు కారం కెమెరా మ్యాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. గుంటూరు కారం కి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న మనోజ్ పరమహంస ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనకి గుంటూరు కారం ఛాన్స్ ఎలా వచ్చిందో.. అలాగే మహేష్ గురించి కొన్ని కామెంట్స్ చేసారు.
గుంటూరు కారం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ద్వారా తనకి మహేష్ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఎప్పటి నుంచో మహేష్ బాబు సినిమాకి పని చెయ్యాలని భావిస్తున్నాను, చాలామంది హీరోలతో పని చేశాను కానీ.. మహేష్ తో చేసే అవకాశం ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడు అనుకోకుండా థమన్ ద్వారా ఈ అవకాశం వచ్చింది. మహేష్ బాబు గురించి చెబుతూ.. ఆయన ఆలోచనలు చాలా అద్భుతంగా ఉంటాయి, సినిమా చిత్రీకరణ సమయంలో ఆయన నాతో పలు ఇన్‌పుట్‌లను పంచుకునేవారు.
మహేష్ కి టెక్నికల్ అంశాల్లో చాలా పరిజ్ఞానం ఉంది. టెక్నీకల్ పరంగా అంత నాలెడ్జ్ ఉన్న నటులను నేను ఇంతవరకూ చూడలేదు. మేము ఇద్దరమూ కలిసి పనిచేయడం ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి అంటూ పరమహంస గుంటూరు కారం షూటింగ్ అలాగే మహేష్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.