Advertisement
Google Ads BL

అఖిల్ నెక్స్ట్ మూవీ పై ఇంకా సస్పెన్స్


అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ ఏప్రిల్ చివరి వారంలో విడుదలైంది. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఘోరమైన డిసాస్టర్ అవవడంతో అఖిల్ అప్పటినుంచి కొత్త సినిమా ప్రకటించలేదు. అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇప్పటికి సస్పెన్స్ నడుస్తూనే ఉంది. కొత్త దర్శకుడితో అఖిల్ కొత్త సినిమా ప్రకటించబోతున్నాడనే ప్రచారం జరిగింది. కానీ అఖిల్ మాత్రం ఇంకా ఇంకా సైలెంట్ మోడ్ లోనే ఉంటున్నాడు.

Advertisement
CJ Advs

అటు చూస్తే అఖిల్ కొత్త సినిమా కోసమో ఏమో.. ఇంకా సిక్స్ ప్యాక్ లుక్ లోనే కనిపిస్తున్నాడు. లుక్ ఇంకా హెయిర్ స్టయిల్  ఏజెంట్ మూవీ హెయిర్ స్టయిల్ నే మైంటైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్,  నా సామి రంగా.. సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉంటున్నాడు. అటు చైతన్య, చందు మొండేటితో కొత్త సినిమా మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. కానీ అఖిల్ విషయమే తేలడం లేదు.

అఖిల్ కొత్త ప్రాజెక్ట్ టైటిల్ ధీర అంటూ ప్రచారం కూడా జరిగినా.. ఇంతవరకు ఆ ప్రోజెక్టు పై అప్ డేట్ రాకపోవడంతో అక్కినేని అభిమానులు డిస్పాయింట్ అవుతున్నారు. మరి ఈ ఏడాది అఖిల్ కొత్త ప్రాజెక్ట్ కబురు ఏమైనా వింటామో లేదో అనే నిరాశలో ఫాన్స్ ఉన్నారు

Still suspense on Akhil next movie:

No update on Akhil next project after Agent 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs