Advertisement
Google Ads BL

కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ షాకింగ్ స్కెచ్!


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు మాంచి కాకమీదున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల జాబితా సహా పనులన్నీపూర్తి చేసుకుని ప్రచారంలో ముందున్న బీఆర్ఎస్ పార్టీ.. ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్‌కు ఎలా అడ్డుకట్ట వేయాలా? అని యోచిస్తోంది. ఈ క్రమంలోనే వ్యూహాలకు పదును పెడుతోంది. అసలే కేసీఆర్ రాజకీయ చాణక్యుడు. ఆయన బుర్రకు పదును పెట్టి మరీ కాంగ్రెస్‌ను ఇరికించేందుకు షాకింగ్ స్కెచ్ వేసి దానిని అమలు కూడా చేసేశారని టాక్. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందనే చూడాలి. ఇంతకీ ఆ స్కెచ్ ఏంటి? దాంతో కాంగ్రెస్‌ను ఎలా ఇరికించారంటారా?   

Advertisement
CJ Advs

అదే ఫార్ములా!!

కర్ణాటకలో విజయం తర్వాత కాంగ్రెస్‌‌ పార్టీలో బీభత్సమైన జోష్‌ వచ్చింది. నేతలంతా విభేదాలను పక్కనబెట్టి పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న తపనతో ఉన్నారు. కర్ణాటకలో అమలు చేసిన ఫార్ములానే తెలంగాణలో కూడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. అయితే కాంగ్రెస్ ప్రయత్నాలకు ఇప్పుడే చెక్ పెట్టాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయినట్టుంది. తాజాగా కర్ణాటక రైతులు తెలంగాణలో ఆందోళన చేయడం హాట్ టాపిక్‌గా మారింది. కొడంగల్, గద్వాలలో కర్ణాటక రైతులు తమకు కరెంటు రావడం లేదని నిరసన తెలిపారు.

గట్టి దెబ్బే..!

కర్ణాటక రైతులు తెలంగాణలో ఆందోళన చేయడం ఆసక్తికరంగా మారినప్పటికీ.. ఈ నిరసనల వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని టాక్ నడుస్తోంది. గులాబీ బాస్ స్వయంగా స్కెచ్ గీసి మరీ ఇలా రైతులతో ఆందోళన చేయించారంటూ ప్రచారం జరుగుతోంది. కర్ణాటక ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిందని.. ఆరు నెలల్లోనే వాటిని అమలుకు చెక్ పెట్టిందని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అక్కడ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం క్షోభ పెడుతోందని.. ఇక్కడ కూడా అదే పని చేస్తుందని.. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే ఇలాగే ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి ఎన్నికల సమయంలో కర్ణాటక రైతుల ఆందోళనలు తెలంగాణ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతాయో చూడాలి.

BRS shocking sketch to implicate Congress!:

Political heat between BRS and Congress party regarding the upcoming elections
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs