టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల జోరు, హుషారు మాములుగా లేదు. చేతిలో సరైన హిట్ లేదు. ఫస్ట్ సినిమా పెళ్లి సందడి హిట్ అవ్వలేదు. ధమాకా మూవీ శ్రీలీల డాన్సులు వల్లే 100 కోట్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత ఆమె నటించిన స్కంద గత నెల 28 న విడుదలైంది. ఆ చిత్రం డిసాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళింది. స్కంద ప్రమోషన్స్ అలా ముగిశాయో లేదో.. ఇలా బాలయ్య భగవంత్ కేసరి ప్రమోషన్స్ లోకి వెళ్ళిపోయింది. బాలకృష్ణ, కాజల్, అనిల్ రావిపూడి తో కలిసి సినిమాని ప్రమోట్ చేస్తూ ట్రెడిషనల్ గా అదరగొట్టేసింది.
గత వారం విడుదలైన భగవంత్ కేసరి ప్రమోషన్స్ ముగియకముందే అమ్మడు వైష్ణవ తేజ్ కలిసి నటించిన ఆది కేశవ ప్రమోషన్స్ లోకి దూకేసింది. నిన్నగాక మొన్న ఆదికేశవ సాంగ్ లాంచ్ కి హాజరైంది. పద్ధతిగా, సంప్రదాయంగా ఉండే శ్రీలీల సినిమాల్లో గ్లామర్ గా కనిపించినా ప్రమోషన్స్ లో ట్రెడీషనల్ గా క్యూట్ గా కనిపిస్తుంది. ఇక ఆది కేశవ నవంబర్ 10 న విడుదలైతే ఆ తర్వాత అమ్మడు ఎక్సట్రార్డినరీ మాన్ ప్రమోషన్స్ కి జంప్ అవుతుంది.
నితిన్ ఎక్సట్రార్డినరీ మాన్ మూవీ కూడా డిసెంబర్ మొదటి వారంలో విడుదల కాబోతుంది. ఆది కేశవ ప్రమోషన్స్, ఆ సినిమా హిట్ అయితే సక్సెస్ సెలబ్రేషన్స్ ముగియకముందే శ్రీలీల నితిన్ తో కలిసి మీడియా ముందుకు వచ్చేస్తుంది. ఆ సినిమా తర్వాత కొద్దిగా అంటే ఓ నెల గ్యాప్ తో గుంటూరు కారం హడావిడి మొదలవుతుంది. ఇలా శ్రీలీల వచ్చే మూడు నెలలు మీడియా ముందే దర్శనమిస్తూ అభిమానులకి కిక్ ఇస్తుంది.