అమ్మను ఎవరైనా ట్రోల్ చేస్తారా? పోనీ బయట వారు ఎవరైనా సరే.. అమ్మా అంటూ ట్రోల్ చేస్తామా? కానీ ఏపీలో ఈ సిత్రం కూడా జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని అమ్మా అంటూనే ట్రోల్ చేస్తున్నారు. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేపట్టారు. ఆమె తన వయసును సైతం పక్కనబెట్టి భర్త కోసం నానా తంటాలు పడుతున్నారు. తన బాదేంటో జనానికి చెప్పుకుంటున్నారు. ఈ తరుణంలో ఆమెకు సపోర్ట్‌గా నిలవకున్నా పర్వాలేదు కానీ ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించడమే షాకింగ్‌గా ఉంది.
గోడు చెబితే తప్పా!
ఆమె ప్రసంగంలో నిజాలు మచ్చుకైనా లేవంటూ ఆరోపిస్తున్నారు. రాజకీయాల్లో ఇదంతా కామన్. ప్రత్యర్థి వర్గం చేసే ప్రసంగంపై ఆరోపణలు సర్వసాధారణం కానీ తమ కుటుంబ సమస్యలనే భువనేశ్వరమ్మ జనం ముందు వినిపిస్తున్నారట. మంచిదే కదా.. ఆమె గోడు ఆమె చెప్పుకుంటున్నారు. అధికార పక్షంపై ఇష్టానుసారంగా విమర్శలు చేయడం లేదు కదా. దీనికెందుకు ఉలికిపాటు? పదే పదే విమర్శలెందుకు? బస్సు యాత్ర మొదలు పెడతారన్నది మొదలు.. ఆమెతో పాటు ఆమె కుమారుడు నారా లోకేష్‌పై ఏదో ఒక రకంగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
మీకెంటి నష్టం!
నారా కుటుంబానికి, నిజాలకు పూర్తిగా విరుద్ధమంటూ ట్రోల్ చేస్తున్నారు. భువనేశ్వరమ్మ తన కుటుంబ గోడు తప్ప, జనం ఆవేదనను పట్టించుకోవడం లేదంటూ విమర్శిస్తున్నారు. ఆమె పుట్టెడు కష్టంలో ఉన్నారు. అలాగే భర్త జైలు పాలైన సమయంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలను సైతం పరామర్శిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇంకేవరిని పట్టించుకోవాలి? తన మనవడిని చంద్రబాబు దాదాపు 50 రోజులుగా చూసుకోవడం లేదని చెప్పడంలో తప్పేముంది? తన కుటుంబ సమస్యల్ని జనానికి చెప్పుకుంటే వచ్చే నష్టం ఏముంది? అని టీడీపీ కార్యకర్తలు సైతం ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్‌లోని పౌరుషాన్ని పుణికిపుచ్చుకోలేకపోయారంటూ దారుణమైన విమర్శలు. ఎందుకు ఇంతలా.. భువనేశ్వరిపై విషం కక్కుతున్నారని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.