ప్రస్తుతం సౌత్ లో ఎలాంటి ప్రోజెక్ట్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే చేతిలో లేదు. వరస డిజాస్టర్స్ తో పూజా హెగ్డే క్రేజ్ తగ్గిపోయింది. దానితో ఆమెని గుంటూరు కారం నుంచి కూడా తప్పించారు. ఆ ఎఫెక్ట్ తో ప్రస్తుతం పూజా ని పిలిచి అవకాశం ఇచ్చే దర్శకనిర్మాతలు ఎవరూ కనిపించడం లేదు. ఆమె చేతిలో మహేష్ ప్రాజెక్ట్ ఉన్నట్లయితే పూజా హెగ్డే కి మరిన్ని అవకాశాలు ఆమె తలుపు తట్టేవి. ప్రెజెంట్ ఆమెని ఎవరూ కన్సిడర్ చెయ్యడం లేదు.
రీసెంట్ గా తన బర్త్ డే వేడుకలని గ్రాండ్ గా జరుపుకున్న పూజా హెగ్డే ఆమె సినిమాలకి గ్యాప్ ఇవ్వడానికి కారణం ఆమె మోకాలికి సర్జరీ చేయించుకుంటుంది.. అందుకే పూజా హెగ్డే సినిమా లు ఒప్పుకోవడం లేదు అన్నారు. ఆమె కాలి దెబ్బ ఇబ్బంది పెట్టడంతో సర్జరీకి మొగ్గు చూపించి.. సినిమాలు ఒప్పుకోవడం లేదు అంటూ చెప్పారు. ఆ విషయంపై క్లారిటీ లేదు.. పూజా హెగ్డే తాజాగా కొన్న ఓ కాస్ట్లీ కారు ఆమెని వార్తల్లో నిలిచేలా చేసింది.
దసరా పండగ సందర్భంగా పూజా హెగ్డే రేంజ్ రోవర్ ఎస్యువీ కారుని కొనుగోలు చేసింది. పూజా హెగ్డే కొన్న కారు విలువ నాలుగు కోట్లు ఉంటుంది అని తెలుస్తోంది. ప్రస్తుతం సౌత్ లో ప్రాజెక్ట్స్ లేకపోతేనేమి.. ఆమె హిందీ ప్రాజెక్ట్స్ తో బిజీగానే ఉంది. అందుకే ఆమె ఇంత కాస్ట్లీ కారుని కొనుగోలు చేసింది అంటూ గుసగుసలాడుకుంటున్నారు.