మెగాస్టార్ చిరంజీవి-వసిష్ఠ కలయికలో క్రేజీ ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న మెగా 156 మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ ని దసరా పండగ సందర్భంగా పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టారు మేకర్స్. కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ లో ఈ చిత్రానికి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి నవంబర్ చివరి వారమైతే బావుంటుంది అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు వశిష్ట మల్లిడి హీరోయిన్స్ ఎంపికపై దృష్టి పెట్టాడు. ఈ సినిమాలో అనుష్కని హీరోయిన్ గా ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే విలన్ కేరెక్టర్ కోసం రానా పేరు పరిశీలిస్తున్నారు.
అయితే ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ అయితే పవర్ ఫుల్ గా ఉంటుంది.. ఇదే టైటిల్ పెట్టే ఆలోచనలు ఉన్నారట. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం మూడు లోకాలని కలుపుతూ సాగే లవ్ రొమాంటిక్ ఫాంటసీ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ మూడు లోకాలకి లింక్ చేస్తూ ఒక చిన్న పిల్ల పాత్ర కూడా ఈ చిత్రంలో కీలకంగా ఉండబోతుంది. జగదీకవీరుడు అతిలోక సుందరి తర్వాత మెగాస్టార్ మళ్ళీ ఆ టైప్ మూవీస్ లో నటించలేదు.
ఇప్పుడు ఈ చిత్రం కూడా జగదీకవీరుడు అతిలోక సుందరి మూవీ టైప్ లోనే ఉండబోతుంది అనే ప్రచారంతో మెగా ఫాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ వారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.