Advertisement
Google Ads BL

గేమ్ ఛేంజర్ సాంగ్ బడ్జెట్ వింటే..


దర్శకుడు శంకర్ ఏది చేసినా అదీ కాస్ట్లీ గానే ఉంటుంది. ఆయన సినిమాలు బడ్జెట్ మితిరిపోతాయనే టాక్ ఉంది. ఇప్పటికే ఆయన తెరకెక్కించిన సినిమాలో సాంగ్స్ చూసినా, లేదంటే వేరే సెట్స్ ఏది చూసినా శంకర్ పెట్టిన ఖర్చు కనిపిస్తుంది. ఇప్పుడు రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్న గేమ్ చెంజర్ బడ్జెట్ కూడా తక్కువేమి కాదు. రామ్ చరణ్-కియారా అద్వానీ లపై శంకర్ కళ్ళు చెదిరే ఖర్చుతో సాంగ్స్ ని చిత్రీకరించారని, ఆ పాటల కోసం వేసిన సెట్స్ కోసమే కోట్లు పెట్టించారనే టాక్ ఉంది.

Advertisement
CJ Advs

ఇప్పుడు గేమ్ ఛేంజర్ నుంచి దివాళి స్పెషల్ గా రాబోతున్న జరగండి.. జరగండి పాట కోసం వేసిన సెట్ ఖర్చు అక్షరాలా 16 కోట్లు అంట. మరి ఈ సాంగ్ కోసం 12 కోట్ల బడ్జెట్ పెట్టారనే ప్రచారమైతే జోరుగా జరిగింది. కానీ ఇప్పుడు ఆ పాట కోసం ఏకంగా 16 కోట్ల ఖర్చు పెట్టారట. సినిమాలో ఆ సాంగ్ కోసం వేసిన సెట్ సినిమాటిక్ గా కాకుండా రియల్ లోకేషన్ లో తీసినట్లు అనిపిస్తుందని చెబుతున్నారు. అందుకే ఆ సెట్ కోసం 16 కోట్లు ఖర్చుపెట్టారట నిర్మాత దిల్ రాజు.

మరి ఆ 16 కోట్ల భారీ బడ్జెట్ సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ పాట బడ్జెట్ రివీల్ అయ్యాకా సాధారణ ప్రేక్షకుడికి కూడా ఆ పాట పై ఇంట్రెస్ట్ మొదలైంది. ఇక రామ్ చరణ్ కాస్ట్యూమ్స్ కూడా ఈ పాట లో బాగా రిచ్ గానే కనిపిస్తుంది. 

Game Changer Movie Jaragandi Song budget is rs 16 crores:

Game Changer Movie Upade
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs