Advertisement
Google Ads BL

ట్విట్టర్ లో ట్రోల్ అవుతున్న బిగ్ బాస్ శివాజీ


బిగ్ బాస్ హౌస్ లో మొదట్లో ఆట విషయంలోనూ, తెలివి విషయంలోనూ సీనియరిటిని చూపించిన శివాజీ ఇప్పుడు తనని నామినేట్ చేసేవారిపై, అలాగే ఇంకా కొంతమందిపై లోలోపల కుళ్ళు పెచుకుంటున్నాడనే ఆరోపణలు కొంతమంది కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్నాయి. నిన్న ఎనిమిదో వారం నామినేషన్స్ లో అమరదీప్ తనని నామినేట్ చేసాడని ఎంతగా రగిలిపోయాడో.. గత వారం భోలే ప్రియాంక, శోభా శెట్టి ని తిట్టడం, సారి చెప్పడం కరెక్ట్ అన్నట్టుగా ఈ వారం వారిని శివాజీ నామినేట్ చెయ్యడం కూడా నెటిజెన్స్ కి నచ్చలేదు.

Advertisement
CJ Advs

ఇక ఈ వారం ఉంటే వచ్చే వారం ఎవరినో ఒకరిని కొట్టేసి వాలంటరీగా వెళ్ళిపోతా అంటూ శివాజీ మాట్లాడం అతను బ్లాక్ మెయిల్ కి నిదర్శనమంటూ నెటిజెన్స్ శివాజీని ట్రోల్ చేస్తున్నారు. అమరదీప్ ఈ వారం నామినేషన్స్ లో శివాజీ అసలు రంగుని బయటపెట్టాడంటూ మాట్లాడుతున్నారు. పల్లవి ప్రశాంత్, యావర్, భోలే, రతిక వీళ్ళతో శివాజీ గ్రూపిజం మైంటైన్ చేస్తున్నాడని, తేజని పిలిచి శోభా శెట్టి గురించి మాట్లాడుతున్నాడు, అలాగే ప్రియాంక, శోభ శెట్టి వలన హౌస్ మొత్తం డిస్ట్రబ్ అవుతుందంటూ చేస్తున్న కామెంట్స్ శివాజీపై నెగిటివిటీ పెరగడానికి కారణమవుతున్నాయి.

లేకపోతే పల్లవి ప్రశాంత్ అమరదీప్ ని నామినేట్ చేస్తూ శివాజీ అన్నకి కంటెండర్ అయ్యే అవకాశం ఇవ్వలేదు, ఆయన చేతికి దెబ్బతాకింది, ఆయన్ని నువ్వు ఎలా నామినేట్ చేస్తామంటూ అమర్ ని నామినేట్ చేసినప్పుడే శివాజీ అతన్ని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసాడో అర్ధమైంది అంటూ నెటిజెన్స్ శివాజీని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. 

Bigg Boss Shivaji is being trolled on Twitter:

Bigg Boss Shivaji vs Amardeep
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs