Advertisement
Google Ads BL

టీడీపీ, జనసేన సమరశంఖం.. వైసీపీలో వణుకు!


వైసీపీ అంతానికి తాజాగా టీడీపీ - జనసేనలు సమరశంఖం పూరించాయి. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో ఉంచిన విషయం తెలిసిందే. తద్వారా టీడీపీ అధినేతతో పాటు పార్టీని చావుదెబ్బ కొట్టామని వైసీపీ భావించింది. ఇప్పుడు రాజమండ్రి వేదికగానే రాజకీయాలు టర్న్ తీసుకోబోతున్నాయి. టీడీపీ - జనసేనల కూటమి ఏం చేసినా రాజమండ్రి నుంచే చేస్తోంది. ఇప్పటికే రాజమండ్రిలోనే జనసేనాని పవన్ కల్యాణ్ పొత్తు ప్రకటన చేశారు. తాజాగా రాజమండ్రి‌లో హోటల్ మంజీరాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఉమ్మడి కార్యాచరణకు రాజమండ్రి వేదికగానే అంకురార్పణ చేశారు.

Advertisement
CJ Advs

రాజుకుంటున్న రాజకీయం

వైసీపీ విముక్త ఆంద్రప్రదేశ్ లక్ష్యంగా ఇరు పార్టీలు ఒక్క తాటిపైకి వచ్చాయి. ఇరుపార్టీల అధినేతల సమావేశంతో రాజమండ్రి కేంద్రంగా రాజకీయాలు ఊపందుకున్నాయి. పవన్ చరిష్మాతో పాటు జనాదరణ వంటివి జనసేనకు కలిసొచ్చే అంశాలు కాగా.. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని 40 ఏళ్లుగా నిలబడటం ఒక ఎత్తైతై.. పార్టీ పెట్టినప్పటి నుంచి సీనియర్లు ఆ పార్టీకి అంటిపెట్టుకుని ఉండటం.. నారా లోకేష్ రాజకీయాల్లో రాటు దేలడం.. ఇక ఇప్పుడు నారా భువనేశ్వరి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, ఇప్పటికే ఉన్న మైలేజ్‌కి తోడు చంద్రబాబు అరెస్ట్ అనంతరం సింపతి రూపాన విపరీతంగా వచ్చిన మైలైజ్ టీడీపీకి బీభత్సంగా కలిసొచ్చే అంశాలు.

పైకి విమర్శలు.. లోలోపల ఆందోళన!

రాజమండ్రిలో టీడీపీ, జనసేనలకు చెందిన 12 మంది సమన్వయ కమిటీ సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ, ఉమ్మడిగా చేపట్టే కార్యక్రమాలు, కలిసి ముందుకు సాగే అంశాలపై చర్చించనున్నారు.ఇప్పుడు ఏపీలో పరిస్థితి ఏంటంటే.. అటు టీడీపీ.. ఇటు జనసేన కార్యకర్తల్లో విపరీతమైన జోష్ పెరగ్గా.. అటు వైసీపీ నేతల్లో అలజడి మొదలైంది. పైకి ఏవో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నా కూడా లోలోపల మాత్రం పరిస్థితి మున్ముందు ఎలా ఉంటుందోనన్న ఆందోళనకు గురవుతున్నాయని టాక్. ఈ క్రమంలోనే విమర్శల్లో డోస్‌ను పెంచే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తానికి ఇప్పుడు ఏపీలోని రాజకీయ పార్టీల చూపులన్నీ రాజమండ్రిపైనే ఉన్నాయని టాక్.

TDP, Jana Sena Samarashankham.. Shaking in YCP!:

Pawan Kalyan, Nara Lokesh Press Meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs