Advertisement
Google Ads BL

ఏపీ నుంచి బాలయ్యను గెంటేశారా..?


టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబును అరెస్ట్ అయిన తర్వాత పార్టీకి అన్నీ తానై చూసుకున్న నందమూరి బాలకృష్ణను ఉన్నఫళాన ఏపీ నుంచి గెంటేశారా..? ఇదంతా చంద్రబాబే చేశారా..? ఏపీలో అస్సలు ఉండొద్దు.. ఏమున్నా తెలంగాణలోనే చూస్కో..? ఎన్నికలప్పుడు మాత్రమే ఏపీకి రావాలి.. అంతవరకూ ఎక్కడా కనిపించొద్దు..? అని బాలయ్యను బావ చంద్రబాబు ఆదేశించారా..? ఒకింత వార్నింగ్ కూడా ఇచ్చారా..? అంటే తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజమేనని సందేహాలు వస్తున్నాయి. బాబు అరెస్ట్ తర్వాత ఏపీకి రావడం పార్టీ పెద్దలతో సమావేశం ఏర్పాటు  చేయడం.. అది కూడా చంద్రబాబు సీటులో కూర్చోవడం.. వరుసగా ములాఖత్‌లకు వెళ్లడం మీడియా ముందుకు వచ్చి అధికార వైసీపీకి వార్నింగ్‌లు ఇవ్వడం జరిగింది. ఏమైందో తెలియట్లేదు కానీ ఈ మధ్య బాలయ్య ఏపీలో ఎక్కడా కనిపించట్లేదు. అసలేం జరిగిందో అని ఆరా తీయగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
CJ Advs


ఇదేనా అసలు కథ..!

చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో బాలయ్య.. ఢిల్లీలో యువనేత నారా లోకేష్ అన్నీ తామై చూసుకున్నారు. అయితే బావ బాబు తర్వాత తానే అన్నట్లుగా ఆయన సీటులో కూర్చోవడం, సమీక్షలు చేయడం.. ఇంకా చాలానే చేశారు. దీంతో బాలయ్య పెత్తనమేంటి..? ఏమిటీ ఈయన రుబాబు..? అంటూ కొందరు తెలుగు తమ్ముళ్లు హర్ట్ అయ్యారట. మరోవైపు లోకేష్ కూడా బాధపడ్డారట. అసలే క్యాడర్ ఆందోళనలో ఉంటే.. వాళ్లకు ఏ విధంగా భరోసా ఇవ్వాలన్నది పక్కనెట్టి సీటులో కూర్చుని కులకడం ఏంటని ఒకింత చినబాబు ఆగ్రహించారట. బాలయ్య చేసిన చేష్టలన్నీ పూసగుచ్చినట్లుగా చంద్రబాబుకు కుటుంబ సభ్యులు చెప్పేశారట. దీంతో బావమరిది అసలుకే ఎసరు తెస్తాడేమోనని గ్రహించిన బావ.. ఏపీ నుంచి వెళ్లిపోవాలని.. అసలిక్కడ ఉండొద్దని తెలంగాణ ఎన్నికల్లో పార్టీ ప్రచారం చేసుకోవాలని ఆదేశాలు.. అంతకుమించి వార్నింగ్‌లాగా చెప్పారట. ఇదే విషయాన్ని ములాఖత్ తర్వాత లోకేష్, నారా భువనేశ్వరి, బ్రాహ్మణి.. బాలకృష్ణకు చెప్పారట. బావ మాటలకు నొచ్చుకున్న బాలయ్య.. ఇక ఆ పంచాయితీనే తనకు వద్దని సినిమాలు చూస్కుంటున్నాడట. అందుకే ఈ మధ్య ఏపీ గురించి కానీ.. బావ గురించి అస్సలే ఎక్కడా మాట్లాడట్లేదు. ఒకవేళ మాట్లాడినా అంటీముట్టన్నట్లుగానే ఉన్నారట.


ఏమిటిది.. ఎవరిది పార్టీ..!

బాబుకు లోకేష్ కొడుకే.. తనకు కూడా అల్లుడే కదా.. అంత మాత్రాన ఆయన కోసం తనను పార్టీకి దూరంగా పెట్టడం ఏ మాత్రం సమంజసం అని బాలయ్య తన ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యులకు చెప్పి తీవ్ర ఆవేదనకు లోనయ్యారట. అసలు పార్టీ పెట్టిందే అన్నగారు ఎన్టీఆర్.. ఆయన నాకు తండ్రి.. ఉంటే పార్టీపై సర్వ హక్కులు నందమూరి ఫ్యామిలీకి ఉంటాయ్.. బావ పెత్తనమేంటి..? ఆయన చేతిలో పార్టీ ఎందుకు ఉండాలి..? ఇన్నాళ్లు పార్టీని  నడిపించారు.. అధికారంలోకి తీసుకొచ్చారు ఇందులో సందేహాలు అక్కర్లేదని అయినా ఇలా కండిషన్స్ తనకే పెట్టడమేంటని బాలయ్య బాగా ఇబ్బంది పడ్డారట. ఇక అసలు రాజకీయాలే వద్దు బాబోయ్ అంటూ.. పూర్తిగా పాలిటిక్స్‌ను పక్కనెట్టి, తన సినిమాలు, ఫంక్షన్లతోనే బిజిబిజీగా బాలయ్య గడుపుతున్నారట. అయితే.. బాలకృష్ణ ఏపీ నుంచి దూరం జరిగాక నందమూరి కుటుంబంలోనూ ఇబ్బందికరపరిస్థితులు నెలకొన్నాయనే టాక్ నడుస్తోంది. ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా బ్రాహ్మణి దగ్గర సోదరుడు మోక్షజ్ఞ కనిపించలేదని.. ఇందుకు కారణం ఈ గొడవలేనని తెలియవచ్చింది. ఎందుకంటే బ్రాహ్మణి-మోక్షజ్ఞ మధ్య మంచి బాండింగ్ ఉంది. వారంలో ఒకట్రెండుసార్లు ఈ ఇద్దరూ కలుస్తుంటారట. 


బ్రహ్మణి కూడా ఔటేనా..?

మరోవైపు.. బ్రాహ్మణిని కూడా నందమూరి ఫ్యామిలీ పక్కనెట్టిందనే టాక్ కూడా నడుస్తోంది. ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో ఈ మధ్య లోకేష్, భువనేశ్వరి కంటే ఎక్కువగా బ్రాహ్మణి పేరే వినిపిస్తోంది. రాబోయే కాలానికి ఈమే నాయకురాలని టీడీపీ శ్రేణులు ఆకాశానికెత్తేస్తున్నాయి. ఇక కదనరంగంలోకి ఆమె దూకేశారని కూడా వార్తలు గుప్పుమన్నాయి. అది కూడా టీడీపీకి సపోర్టుగా ఉన్న పత్రికలు, చానెల్స్‌లో రావడంతో ఇక ఇంతకుమించి బ్రాహ్మణికి హైప్ అక్కర్లేదని.. తిన్నగా సైడ్ చేస్తున్నారట. అందుకే తొలుత టీడీపీ అనుకూల మీడియాలో బ్రాహ్మణి యాత్ర చేస్తుందని ఓ రేంజ్‌లో ప్రచారం, అంతేకాదు పార్టీ సారథ్యమే చేపడుతుందని కూడా పేపర్లో బ్యానర్ వార్తలు, టీవీల్లో స్పెషల్ స్టోరీలు, హెడ్డింగ్స్‌లో తెగ ఊదరగొట్టేశారు. సీన్ కట్ చేస్తే తెరవెనుక ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. అటు బాలయ్య.. ఇటు బ్రాహ్మణి పేరు ఎక్కడా కనిపించట్లేదు.. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారట. మొత్తానికి చూస్తే.. పార్టీ ఏదైనా కార్యక్రమాలు చేపట్టాలంటే మాత్రం ... అదేనండోయ్.. క్యాండిల్ ర్యాలీ, పళ్లెం-గంట, న్యాయానికి సంకెళ్లు అనే నిరసనలకు బ్రహ్మణి పరిమితం అయ్యారన్న మాట!. ఇందులో నిజానిజాలెంత అనేది తండ్రీకూతుళ్లకే తెలియాలి మరి.

Where is Balakrishna Nandamuri?:

Is Balakrishna out from AP
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs