Advertisement
Google Ads BL

డివివి మామ.. నువ్వు తోపు అంతే!


ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలై.. నెత్తిన పెట్టుకుంటున్న బ్యానర్ ఏదైనా ఉందీ అంటే అది ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నిర్మించిన డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఈ బ్యానర్ ఫ్యాన్స్‌ని అలా ఖుషి చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యానర్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా OG తెరకెక్కుతోంది. ఫ్యాన్స్ అందరూ తమ హీరోల సినిమాల విషయంలో కోరుకునే అప్‌డేట్స్‌ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ ఇచ్చినట్లుగా ఏ బ్యానర్ ఇవ్వడం లేదంటే అస్సలు అతిశయోక్తి కానే కాదు. పవన్ కళ్యాణ్ OG కి సంబంధించి ఫ్యాన్స్ అడిగినా, అడగకపోయినా.. అప్‌డేట్స్‌తో అల్లాడిస్తూ వస్తున్నారు. ఇప్పుడిదే బ్యానర్‌లో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది.

Advertisement
CJ Advs

సరిపోదా శనివారం అనే టైటిల్‌తో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్‌మెంట్ వచ్చిందో, లేదో వరుస అప్‌డేట్స్‌తో సోషల్ మీడియాని షేకాడిస్తున్నారు. నానికి ఇది 31వ చిత్రం. అనౌన్స్‌మెంట్‌తోనే స్నీక్ పీక్ వదిలిన మేకర్స్ ఆ వెంటనే హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ నటిస్తున్నట్లుగా అప్‌డేట్ ఇచ్చారు. నానితో ప్రియాంక నటించడం ఇది రెండోసారి. అలాగే డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌‌లో వరుస చిత్రాలలో నటించే అవకాశం కూడా ఈ అమ్మడికే వరించింది. హీరోయిన్ అనౌన్స్‌మెంట్ వచ్చిందో లేదో... మ్యూజిక్ డైరెక్టర్ అప్‌డేట్ ఇచ్చారు. ఆ వెంటనే వెర్సటైల్ యాక్టర్ ఎస్.‌జె. సూర్య ఇందులో నటిస్తున్నట్లుగా ప్రకటించారు.

ఇలా వరుస అప్‌డేట్స్‌తో ట్రెండింగ్‌లో ఉన్న ఈ సినిమా గ్లింప్స్‌ను కూడా ఓపెనింగ్‌కు ముందే వదిలారు. సినిమా ప్రారంభం చాలా కాలం అవుతున్నా.. ఇంత వరకు ఎటువంటి అప్‌డేట్స్ ఇవ్వని సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ తాజాగా అన్‌చెయిన్ అంటూ గ్లింప్స్ వదిలిన డివివి నిర్మాతలు 24న అంటే రేపు గ్రాండ్‌గా సినిమాను లాంచ్ చేయబోతున్నారు. ఇక ఈ అన్‌చెయిన్‌ వీడియో అయితే.. ఓ డిఫరెంట్ చిత్రం టాలీవుడ్ నుండి పాన్ ఇండియాకు పరిచయం కాబోతుందనే ఫీలింగ్‌ని ఇవ్వడం విశేషం. అంటే సుందరానికీ లాంటి కల్ట్ ఎంటర్‌టైనర్‌ని అందించిన నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మరోసారి డిఫరెంట్ సినిమాతో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Pawan and Nani fans praises on DVV entertainment :

Nani fans happy with nani31 updates 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs