Advertisement
Google Ads BL

ప్రభాస్‌కు కన్నప్ప టీమ్ స్పెషల్ విషెస్!


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23)ను పురస్కరించుకుని కన్నప్ప మూవీ టీమ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలను తెలియజేసింది. డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప ఇటీవల గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రారంభమైన అనంతరం ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్‌డేట్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది. అందుకు కారణం ఎవరో కాదు ప్రభాస్. ప్రభాస్ ఇందులో ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా టీమ్ అధికారికంగా ప్రకటించింది.

Advertisement
CJ Advs

ప్రభాస్ ఒక్కడే కాదు.. ఈ భారీ ప్రాజెక్ట్‌లో ప్రతీ ఇండస్ట్రీలోని స్టార్ హీరో భాగస్వామి అవుతున్నారు. టాలీవుడ్ నుంచి ప్రభాస్, కన్నడ ఇండస్ట్రీ నుంచి శివ రాజ్ కుమార్, కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇలా ప్రతీ ఒక్క స్టార్ హీరో కన్నప్ప చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.. దీంతో ఈ చిత్రంపై నేషనల్ వైడ్‌గా హైప్ పెరిగింది.

 ఇక ప్రభాస్ బర్త్ డే‌ని పురస్కరించుకుని.. ప్రభంజనమై ప్రేక్షక హ‌ృదయాలను మనసుతో, వ్యక్తిత్వంతో, నటనతో గెలుచుకుని.. ప్రపంచమంతా శభాష్ అనిపించుకుంటున్న మా ప్రభాస్‌కి జన్మదిన శుభాకాంక్షలు.. శతమానం భవతి, శత శత మానం భవతి అంటూ కన్నప్ప టీమ్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ పోస్టర్‌లో ప్రభాస్ నటించిన బాహుబలి, సాహో, సలార్‌లోని స్టిల్స్‌ని యాడ్ చేసిన తీరు.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు యమా నచ్చేసింది. అందుకే ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బుల్లితెరపై మహాభారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ మూవీలో కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతోన్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

Kannappa team beloved wishes to Prabhas:

Kannappa Makers Greet Prabhas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs