Advertisement
Google Ads BL

Nani31 సరిపోదా శనివారం..ఏంటీ వీడియో?


అంటే సుందరానికీ వంటి కల్ట్ ఎంటర్‌టైనర్‌ని అందించిన నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మరోసారి ఓ డిఫరెంట్ మూవీతో Nani31 కోసం చేతులు కలిపారు. సరిపోదా శనివారం అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేసుకున్న ఈ చిత్రాన్ని ఆస్కార్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ను అందించిన డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్ర ప్రకటనతో పాటు తాజాగా అన్‌చెయిన్ అంటూ ఓ గ్లింప్స్‌ని మేకర్స్ వదిలారు. ఈ అన్‌చెయిన్ వీడియో కూడా టైటిల్ మాదిరిగానే చాలా డిఫరెంట్‌గా ఉంది.

Advertisement
CJ Advs

సాయికుమార్ వాయితో మొదలైన ఈ గ్లింప్స్‌లో హీరో నానినీ గొలుసులతో కట్టేసి ఉంచారు. మన పెద్దలు ఒక మాట అనే వాళ్లు. రాజుకైనా, బంటుకైనా.. ఎలాంటి వాడికైనా ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూడాలి అని. అదే మాటను మన కొత్తతరం కుర్రాళ్లు ఇంకొంచెం మార్చి.. నీకంటూ ఓ టైమ్ వస్తుందిరా.. అందాక మూసుకుని వెయిట్ చెయ్ అన్నారు. ఇప్పుడు మన కథ.. ఆ మాట చెప్పిన ఆ తరం గురించో.. ఆ మాటను మార్చిన ఈ తరం వారి గురించో కాదు.. అప్పటినుండి ఇప్పటి దాకా.. ఏ తరం వాడైనా.. కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేది ఆ ఒక్క రోజు గురించే. అలాంటి రోజు.. ఆ ఒక్కరోజు.. ఒకడికి వారానికి ఒకసారి వస్తే.. వాడ్ని ఎవరైనా ఆపాలని అనుకోగలరా? అనుకున్నా ఆపగలరా? శనివారం.. ప్రతీ శనివారం.. సరిపోదంటారా?.. అని సాయికుమార్ వాయిస్ వెనుక వినిపిస్తుంటే.. నాని విరోచితంగా సంకెళ్లు తెంచుకుని జనం ముందు నిలబడిన తీరు.. ఇదొక యాక్షన్ సినిమా అనేది తెలియజేస్తుంది. 

టైటిల్ చాలా సాఫ్ట్‌గా ఉన్నా.. ఈ గ్లింప్స్ చూస్తుంటే.. మాస్ యాక్షన్ సినిమా ఇదని అనిపిస్తుంది. మొత్తానికి నాని, వివేక్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశారనేది మాత్రం తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కకున్న ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. వెర్సటైల్ యాక్టర్ ఎస్.‌జె. సూర్య ఓ కీలక పాత్రలో నటించనున్నారు. మంగళవారం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించబోతున్నారు.

Nani Saripodhaa Sanivaaram Tigle Glimpse Out:

Nani Saripodhaa Sanivaaram Glimpse Creates Sensation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs