Advertisement
Google Ads BL

గుంటూరు కారం కారంగా రమ్యకృష్ణ


మహేష్ బాబు-త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతోన్న గుంటూరు కారం షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో నడుస్తుంది. మహేష్ బాబు ఆగస్ట్ వరకు అటు ఇటుగా డేట్స్ కేటాయించినా.. ఆగస్ట్ చివరి నుంచి గుంటూరు కారం సెట్స్‌లోనే కనిపిస్తున్నారు. ఎలాగైనా ఈ సినిమాని సంక్రాంతి బరిలో దించాలని కసిగా కష్టపడుతున్నారు. ఇక దసరాకి గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ వస్తుంది అని మహేష్ ఫ్యాన్స్ ఆశపడితే.. నిర్మాత నాగ వంశీ గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ దసరాకి ఉంటుంది అని చెప్పారు.

Advertisement
CJ Advs

సోమవారం దసరా స్పెషల్‌గా అనౌన్స్‌మెంట్ ఉంటుందేమో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌‌గా నటిస్తుండగా.. జగపతి బాబు మెయిన్ విలన్‌గా స్టైలిష్ గా కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం ఆయన స్పెషల్‌గా మేకోవర్ అయ్యారట. ఇంకా ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. గుంటూరు కారం కోసం ఆమె డిసెంబర్ మొదటివారం వరకు డేట్స్ కేటాయించారని సోషల్ ఇండియా టాక్. ఇందులో ఆమె పాత్ర కారం కారంగా ఉండబోతుందని, త్రివిక్రమ్ తనదైన స్టైల్‌లో ఆమె పాత్రని డిజైన్ చేశారనేలా టాక్ నడుస్తోంది.

మరి గుంటూరు కారం షూటింగ్ డిసెంబర్‌కి ఫినిష్ చేసి చాలా వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి జనవరి 13న ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి విడుదల చేయాలని త్రివిక్రమ్, నిర్మాతలు కష్టపడుతున్నారు. అదే జరగాలని, పోస్ట్ పోన్ అనే మాట వినకూడదని మహేష్ అభిమానులు కోరుకుంటున్నారు.

Ramya Krishna in Guntur Kaaram Movie:

Guntur Kaaram Movie Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs