Advertisement
Google Ads BL

కాజల్‌కి వర్కౌట్ అయ్యిందా..


కాజల్ అగర్వాల్ కరోనా సమయంలో గౌతమ్‌ని పెళ్లి చేసుకున్నాక మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీలో నటించింది.. కానీ ఆ చిత్రంలో కాజల్ సీన్స్ కట్ చేసేశారు. ఆ తర్వాత కాజల్, కమల్ హాసన్‌తో ఇండియన్ 2 సెట్స్‌లోకి వెళ్ళింది. ఆ చిత్రం ఇంకా విడుదల కాలేదు. ఈలోపు బాలకృష్ణ భగవంత్ కేసరిలో ఛాన్స్ వచ్చింది. ఈ చిత్ర షూటింగ్ ఫినిష్ అయ్యింది.. దసరాకి విడుదల కూడా అయ్యింది. ఈ చిత్రంలో కాజల్ కాత్యాయని పాత్రలో లుక్స్ వైజ్‌గా చక్కగా కనిపించింది. 

Advertisement
CJ Advs

కాజల్ పాత్ర నిడివి తక్కువే అయినా, పాత్ర పరిధి ఎలా ఉన్నా బాలకృష్ణ పక్కన పర్ఫెక్ట్ జోడీగా కనిపించింది. కాజల్ లుక్స్ విషయంలో కాంప్లిమెంట్స్ వచ్చాయి. మరి దీనిని బట్టి కాజల్ వైపు సీనియర్ హీరోలు చూసినా చూడొచ్చు. ఇప్పటికే అవకాశాల కోసం కాజల్ అగర్వాల్ పారితోషికం తగ్గించుకుంది అనే టాక్ ఉంది. భగవంత్ కేసరికి కోటి నుంచి కోటిన్నర మధ్యలో ఆమె పారితోషికం ఉందట. ఈ లెక్కన సీనియర్ హీరోలు తమ సినిమాల్లో కాజల్ కి ఛాన్స్ లు ఇస్తే గ్లామర్ బ్యూటీ అలాగే పారితోషికం పరంగా బడ్జెట్ లోపే ఉంటుంది.

మరి భగవంత్ కేసరి తర్వాత చిరు, వెంకీ, నాగార్జున తమ సినిమాలలో కాజల్‌కి అవకాశాలు ఇస్తారేమో చూడాలి. వాస్తవానికి నాగార్జున ‘ది ఘోస్ట్’ సినిమాలోనూ ముందు కాజల్‌నే తీసుకున్నారు. కొంత పార్ట్ షూట్ తర్వాత ప్రెగ్నెన్నీ కారణంగా ఆమె ఆ సినిమా నుండి తప్పుకుంది. సోనాల్ చౌహాన్ ఆ ఛాన్స్‌ని దక్కించుకుంది. కాజల్ విషయానికి వస్తే.. ఇప్పటికే ఇండియన్ 2తో పాటుగా కాజల్ కొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగానే ఉంది. ఇక గ్లామర్ పరంగా తానేమీ తగ్గను అన్నప్పటికీ.. కాజల్‌కి ఇకపై గ్లామర్ రోల్స్ వచ్చే ఛాన్స్ అయితే లేదు.

Is Bhagavanth Kesari Worked for Kajal Aggarwal:

Senior Heroes Eye on Kajal Aggarwal After Bhagavanth Kesari
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs