Advertisement
Google Ads BL

శివాజీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన నాగ్


బిగ్ బాస్ సీజన్ 7లో అందరి మనసులని గెలుచుకుని ముందుకు వెళుతున్న హౌస్‌మేట్ శివాజీ.. ఒక్కో సమయంలో పల్లవి ప్రశాంత్‌ని బాగా లేపుతున్నాడనిపిస్తుంది. ఇక కొత్తగా హౌస్‌లో యావర్‌ని అలాగే చేస్తున్నాడు. అయితే కొద్దిరోజులుగా శివాజీ హౌస్‌లో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో అమరదీప్ తనని డిసర్వింగ్ అన్నాడని బాగా హర్ట్ అయ్యాడు. దానితో కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లి చెయ్యి నొప్పి వస్తుంది. ఏడుస్తున్నాను, అందరూ చూసినప్పుడు నవ్వుతున్నాను అన్నాడు. మీరు ఇబ్బంది పడుతుంటే.. డాక్టర్స్ చెక్ చేసి మీరు హౌస్‌లో ఉండాలో వెళ్లాలో చెబుతారని చెప్పి బిగ్ బాస్ శివాజీని పంపేశాడు.

Advertisement
CJ Advs

ఇక నాగార్జున కూడా శనివారం ఎపిసోడ్‌లో శివాజీని స్పెషల్ గా కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి.. ఏంటి శివాజీ చెయ్యి బాగా నొప్పిగా ఉందా.. వెళ్ళిపోతావా, మధ్యలో వెళ్ళిపోతా అంటున్నావ్ అని అడిగారు. నువ్వు రీతూకి ఛాలెంజ్ చేసి వచ్చావు అన్నారు. అవును బాబు.. నాకు వెళ్ళాలి అని లేదు కానీ చెయ్యి సపోర్ట్ చేయడం లేదు. వాళ్ళు అన్నారు అని కాదు.. నాకు చెయ్యి ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో తెలియదు అన్నాడు. దానికి నీ మైండ్‌లో అలా ఉందా.. లేకపోతే హెల్త్ అలా అనిపిస్తుందా అని అడిగితే శివాజీ చెయ్యి అన్నాడు.

బిగ్ బాస్ ప్రోపర్‌గా డాక్టర్స్‌తో చెక్ చేయిస్తుంది.. నువ్ ఫీలవ్వకు అన్నారు నాగ్. బాబు నాకు రోజు ఫిజియోథెరపీ చేయించమని శివాజీ అడగ్గానే సరే చేయిద్దాం..ధైర్యంగా ఉండు.. నీకు ఫిజియోథెరపీ చెయ్యడానికి డాక్టర్స్‌ని పంపిస్తామంటూ శివాజీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసి.. హౌస్ మేట్స్‌తో ఇకపై శివాజి రెట్టించిన ఉత్సాహంతో ఆడుతాడని నాగ్ చెప్పారు.

Sivaji Problem Solved in Bigg Boss House :

King Nagarjuna Solved Bigg Boss Contestant Sivaji Health Problem 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs