మెగా చిన్నకోడలిగా మెగా ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వబోతున్న లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ పార్టీల్లో మునిగి తెలుతుంది. రెండు వారాల క్రితమే మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో అల్లు-మెగా ఫామిలీస్ సందడి చేసాయి. ఇక అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లే ముందు రోజు తన ఇంట్లోనే వరుణ్ తేజ్ కి లావణ్య కి అదిరిపోయే ప్రీ వెడ్డింగ్ బాష్ ఏర్పాటు చేసాడు. ఈ పార్టీలో కొంతమంది స్నేహితులు అంటే నితిన్, రీతూ వర్మ ఇంకా మెగా-అల్లు ఫామిలీస్ సందడి చేసాయి.
ఇక పెళ్ళికి తేదీ దగ్గరపడుతూ ఉండడంతో లావణ్య త్రిపాఠి గర్ల్స్ పార్టీ లో మునిగిపోయిన ఫొటోస్ ని రీతూ వర్మ, నీరజ కోనలు ఇన్స్టాలో షేర్ చేసారు. మరి పెళ్ళికి ముందు పెళ్లి కూతురు తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇలాంటి గర్ల్స్ పార్టీ చేసుకుంటారు. అలానే లావణ్య తన స్నేహితులు నిహారిక, రీతూ వర్మ, నీరజ కోన మరికొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి ఈ పార్టీ ని చేసుకున్న పిక్స్ చూస్తే అమ్మో మెగా చిన్న కోడలు పార్టీల మీద పార్టీలు చేసుకుంటుంది అంటారు.
ఇక వచ్చే నెల అంటే నవంబర్ మొదటి వారంలో ఇటలీ వేదికగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతుంది. ఈ పెళ్ళికి ఇరు కుటుంబాల నుంచి ముఖ్యమైన వారు, అలాగే వరుణ్ తేజ్, లావణ్య ల స్నేహితులు హాజరవుతారని తెలుస్తుంది.