బాలకృష్ణ భగవంత్ కేసరి అక్టోబర్ 19 న విడుదలైంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి డైరెక్టర్. బాలకృష్ణ - అనిల్ రావిపూడి మొదటిసారి జోడి కట్టారు. కామెడీ డైరెక్టర్ గా సక్సెస్ ఫుల్ మూవీస్ తీసిన అనిల్ తో మాస్ హీరో బాలయ్య జత కట్టడం అందరిలో ఆసక్తి పెరిగింది. ఇక విడుదల రోజు లియో మూవీ పోటీ పడి ఓపెనింగ్స్ పట్టుకుపోయినా.. ఫైనల్ గా దసరా విన్నర్ భగవంత్ కేసరి నిలిచింది. అయితే ఇప్పుడు భగవంత్ కేసరి హిట్ ని ఒక వర్గం మీడియా తట్టుకోలేకపోతుంది.
అందుకే భగవంత్ కేసరిపై విషం చిమ్మడం మొదలు పెట్టింది. భగవంత్ కేసరి సినిమాని జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ బాయ్ కాట్ చేసారు. ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ఎన్టీఆర్ స్పందించకపోవడంతో బాలకృష్ణ ఐ డోంట్ కేర్ బ్రదర్ అన్నాడు.. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ కి మండి సినిమా చూడలేదు. మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా రాలేదు. అలాగే చంద్రబాబు జైల్లో ఉండడంతో టీడీపీ కార్యకర్తలెవరూ భగవంత్ కేసరి థియేటర్స్ వైపు పోలేదు. అటు పవన్ కళ్యాణ్ జనసేన తో టీడీపీకి పొత్తు ప్రకటించారు. అది నచ్చని మెగా ఫాన్స్ భగవంత్ కేసరిని పట్టించుకోలేదు.
తారక్, పవన్ ఎఫెక్ట్ భగవంత్ కేసరిపై బాగా పడింది. మొదటి రోజు కన్నా రెండో రోజు కలెక్షన్స్ తగ్గడానికి ప్రధాన కారణమిదే.. ఎన్టీఆర్ ఫాన్స్-మెగా ఫాన్స్ ఇద్దరూ కలసి భగవంత్ కేసరికి బాలయ్యకి దెబ్బేసారు.. ఆఖరుకి కళ్యాణ్ రామ్ కూడా బాలా బాబాయ్ ని పట్టించుకోలేదు అంటూ బ్లూ మీడియా గొంతు చించుకుని అరవడమే కాదు.. భగవంత్ కేసరి రివ్యూ లపై కూడా విషం చిమ్మారు. ఏది ఎలాగున్నా ఈ దసరా విన్నర్ గా భగవంత్ కేసరిని నిలిచింది. మిగిలిన రెండు సినిమాలు తేలిపోవడంతో భగవంత్ కేసరి సినిమాకి ప్రేక్షకులు ఓటేస్తున్నారు. ఇప్పుడేం రాస్తుందో బ్లూ మీడియా.