హీరో నాని తో గ్యాంగ్ లీడర్ మూవీ తో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక అరుళ్ మోహన్. ఇపుడు బిజీ హీరోయిన్ గా తెలుగు తమిళ మూవీస్ తో హడావిడి చేస్తుంది. ఏకంగా పవన్ కళ్యాణ్ తో OG లో నటిస్తున్న ప్రియాంక ఇప్పుడు తనకి అచ్చొచ్చిన హీరో నానితో మరోసారి జోడి కట్టబోతుంది.
అంటే సుందరానికీ లాంటి కల్ట్ ఎంటర్‌టైనర్‌ని అందించిన నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మరోసారి #నాని31 కోసం కలిసి వస్తున్నారు. తమ గత చిత్రం ఆస్కార్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్ ను అందించిన డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో నానికి జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు మేకర్స్.
ఈసారి డిఫరెంట్ జోనర్ ని ఎక్స్ ఫ్లోర్ చేయబోతున్నారు. ఈరోజు విడుదలైన అనౌన్స్ మెంట్ వీడియో లో అది స్పష్టంగా కనిపిస్తుంది. షార్ట్ వీడియో షూట్ మేకింగ్ కోసం జరుగుతున్న పనులు గురించి స్నీక్ పీక్ ప్రజంట్ చేస్తోంది. ఈ సారి ఎగ్జైటింగ్‌గా ఉండేలా ప్రామిస్ చేస్తున్న నాని కళ్లలో ఇంటెన్స్ ని చూడవచ్చు.
వీడియోలో ఉపయోగించిన కలర్స్, నేపథ్య సంగీతం చూస్తుంటే నాని, వివేక్ ఈసారి చాలా డిఫరెంట్ జోనర్ తో అలరించనున్నారని అర్ధమౌతుంది. చివర్లో ఎక్సయిటింగ్ అప్డేట్ ఇచ్చారు. #Nani31ని 23న రివిల్ చేసి, 24న గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు.
#Nani31లో అద్భుతమైన తారాగణం, స్ట్రాంగ్ టెక్నికల్ పని చేస్తోంది. మరిన్ని వివరాలు లాంచింగ్ రోజున తెలియజేస్తారు మేకర్స్.