బిగ్ బాస్ సీజన్ 7 ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదోవారంలోకి అడుగుపెడుతుంది. ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో కానీ.. మళ్ళీ అమ్మాయే డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. పూజ-అశ్విని కి ఓట్స్ తక్కువ పడుతున్నాయి. అయితే రేపు ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం పక్కనబెడితే.. ఈరోజు హోస్ట్ నాగార్జున ఎవరికి క్లాస్ పీకుతారో అనే ఆత్రుత ప్రేక్షకుల్లో కనిపిస్తే.. హౌస్ మేట్స్ లో కాస్త భయం కనబడుతుంది. ఈ వారం నామినేషన్స్ విషయంలో చాలామంది ఎక్కువగానే రెచ్చిపోయారు.
మరి శనివారం వచ్చేసింది. నాగార్జున ఎపిసోడ్ షూట్ జరిగిపోవడమే కాదు.. అప్పుడే ప్రోమో కూడా వచ్చేసింది. నాగార్జున ఎవరిని ఏమంటారో, అనబోతున్నారో, అనుకునేలోపు నాగ్ కూడా స్ట్రయిట్ గా హౌస్ మేట్స్ ని ఎడా పెడా వాయించి వదిలిపెట్టారు. ముందుగా అశ్వినితో మొదలు పెట్టిన నాగార్జున అశ్విని కుండ పగలగొట్టి ఎందుకిలా చేసావ్ అశ్విని అని అడిగారు. దానితో అశ్విని తెల్లమొహం వేసింది. తర్వాత భోలే ని లేపి మనం ఊర్లో చాలా మాట్లాడుకుంటాం. ఊతపదాలు ఉంటాయి. అవి ఎక్కడ పడితే అక్కడ మట్లాడకూడదు. ఎర్రగడ్డ అని ఎందుకు వాడవు భోలే అనగానే ఆమె సెన్సులెస్ అంది అన్నాడు. సెన్సులెస్ కి మెంటల్ కి ఎంత తేడా ఉంది అన్నారు నాగ్.
ఇక ప్రియాంక ఏంటమ్మా నోట మాట జారితే సారీ చెప్పినా సరిపోదు అంటూ ప్రియాంకకి ఇచ్చిపడేసారు. దానితో ప్రియాంక మొహం నల్లగా మాడిపోయింది. తర్వాత పల్లవి ప్రశాంత్.. సందీప్ ఒట్టు వేసాడు, నువ్వెందుకు ఓటు వెయ్యలేదు, ఊరొడంటే తప్పేమి కాదు కదా అన్నారు. నేను అలా అనలేదు అన్నాడు. నువ్వు మట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు అంటూ వార్నింగ్ ఇస్తూనే కుండ పగలగొట్టారు. గ్రూపిజం అంటూ శోభకి, తేజకి కలిపి క్లాస్ పీకారు నాగార్జున. ఈ శనివారం ఎపిసోడ్ గరం గరంగా ఉండబోతుంది అనేది ఈ ప్రోమో చూస్తే తెలుస్తుంది.