తమిళనాట హీరో జీవాతో కలిసి నటించిన రంగం సినిమా తెలుగులో కూడా డబ్బింగ్ మూవీగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవడంతో ఒక్కసారిగా సీనియర్ హీరోయిన్ రాధ కుమార్తె కార్తీక పేరు మార్మోగిపోయింది. ఆ చిత్రం హిట్ అవడంతో కార్తీక కి బోయపాటి ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. మెయిన్ హీరోయిన్ గా త్రిష, కార్తీక సెకండ్ హీరోయిన్ గా వచ్చిన దమ్ము ఆశించిన ఫలితం అందుకాకపోవడంతో కార్తీక కూడా తెలుగులో కనుమరుగయ్యింది. తమిళనాట అవకాశాలు అప్పుడప్పుడు పలకరిస్తున్నాయి తప్ప ప్రోపర్ గా అమ్మడు బిజీ గా కనిపించిన సందర్భం లేదు.
అయితే అవకాశాలు లేకపోవడంతో కార్తీక గుట్టు చప్పుడు కాకుండా పెళ్ళికి సిద్ధమైనట్లుగా కనిపిస్తుంది. తాజాగా కార్తీక సోషల్ మీడియాలో ఓ పిక్ షేర్ చేసింది. అందులో ఓ వ్యక్తితో క్లోజ్ గా ఉండడమే కాదు.. కార్తీక చేతి వెలికి కాస్ట్లీ ఉంగరమొకటి కనిపించింది. అంటే కార్తీక ఆ వ్యక్తితో నిశ్సితార్ధం చేసుకున్నట్టుగా చెప్పకనే చెప్పేసింది అంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. కార్తీక తన ఇన్స్టా హ్యాండిల్ లో చేసిన ఆ పిక్ చూసి ఆమెకి చాలామంది శుభాకాంక్షలు చెబుతున్నారు,
మరి నిజంగానే కార్తీక పెళ్లి జీవితంలోకి అడుగుపెడుతుందా అనే అనుమానం బలపడేలా ఈ ఎంగేజ్మెంట్ కూడా గుట్టు చప్పుడు కాకుండా జరిగింది అంటూ ప్రచారం మొదలైంది. దీనిని బట్టి కార్తీక త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్టుగా మాత్రమే అర్ధమవుతుంది.