Advertisement
Google Ads BL

శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా విడిపోయారా..


బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా జైలుకెళ్లొచ్చాక తన మొహాన్ని మీడియాకి కనబడకుండా మాస్క్ వేసుకుని తిరుగుతున్నాడు. జైలుకెళ్లి బెయిల్ పై వచ్చాక భార్య శిల్పా శెట్టి అలాగే పిల్లలతో కలిసే కనిపిస్తున్నాడు. రీసెంట్ గా వినాయక చవితి సెలెబ్రేషన్స్ లో వీరు కలిసే సందడి చేసారు. అయితే రీసెంట్ గానే రాజ్ కుంద్రా మీడియా ముందుకు వచ్చాడు. అది కూడా మాస్కు లేకుండా తొలిసారి మీడియా ముందుకు వచ్చి అందరికి షాకిచ్చాడు. రాజ్‌ కుంద్రా జీవితంలోని కాంట్రవర్సీలే నేపథ్యంగా రూపొందిన యూటీ 69 మూవీ ప్రమోషన్స్ లో రాజ్ కుంద్రా మీడియాతో మాట్లాడాడు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా రాజ్ కుంద్రా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. శిల్పా శెట్టి, తాను విడిపోయామని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అయితే శిల్పా శెట్టి పేరు ఎక్కడా మెన్షన్ చెయ్యకుండా తాము సపరేట్ అయ్యామంటూ పెట్టిన ఇండైరెక్ట్ పోస్ట్ చూసి శిల్పా శెట్టి-రాజ్ కుంద్రాలు విడాకులు తీసుకుని విడిపోయి ఉంటారు అందుకే రాజ్ కుంద్రా ఇలా పోస్ట్ పెట్టాడని కొందరు మాట్లాడుతుంటే.. మరికొందరు నిన్నమొన్నటివరకు ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట ఇప్పుడు విడిపోయామంటూ చెప్పేది తమ యూటీ 69 ప్రాజెక్ట్ ప్రమోషన్స్ కోసమే అంటున్నారు.

మరి రాజ్ కుంద్రా పెట్టిన పోస్ట్ దేనికి సంబందించిందో తెలియక శిల్ప అభిమానులు చాలా ఆందోళన పడుతున్నారు. 

Raj Kundra writes we have separated’ in new post:

Shilpa Shetty Husband Raj Kundra Separation Post Viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs