విజయ్-లోకేష్ కనగరాజ్ కలయికలో క్రేజీ ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన లియో నిన్న గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. తెలుగులో భగవంత్ కేసరితో పోటీ పడిన లియో మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా బాలయ్యపై చెయ్యి సాధించింది. భగవంత్ కేసరి కన్నా తెలుగు రాష్ట్రాల్లో లియో కే భారీ ఓపెనింగ్స్ కట్టబెట్టారు తెలుగు ప్రేక్షకులు. నిన్న పలు భాషల్లో ప్యాన్ ఇండియా ఫిల్మ్ గా విడుదలైన ఈ చిత్రానికి కొన్ని చోట్ల నెగెటివ్ టాక్ రాగా.. తమిళనాట ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ సొంతమయ్యాయి. మొదటిరోజు ప్రపంచ వ్యాప్తంగా లియో 130 కోట్లకి పైగానే వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.
అయితే లోకేష్ కనగరాజ్ పై ఉన్న అంచనాలు లియో అందుకోలేకపోయింది. విక్రమ్ సాలిడ్ హిట్ తో లోకేష్ పై అంచనాలు బాగా పెరిగాయి. కానీ లియో వాటిని అందుకోవడంలో విఫలమైంది అనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ ఓటిటీ పార్ట్నర్ గా మారింది. భారీ డీల్ తో ఈ భారీ బడ్జెట్ చిత్ర డిజిటల్ హక్కులని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోవడంతో లియో టైటిల్ కార్డ్స్ లో ఓటిటీ పార్ట్నర్ గా నెట్ ఫ్లిక్స్ పేరు పడింది.
ఇక లియోని నవంబర్ మూడో వారంలో స్ట్రీమింగ్ కి తెచ్చే అవకాశం ఉంది. అయితే డివైడ్ టాక్ తోనే ఈ చిత్రం కోట్లు కొల్లగొడుతుంటే.. ఓటిటీ డేట్ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రెండు వారాల తర్వాత లియో కలెక్షన్స్ ని బట్టి స్ట్రీమింగ్ డేట్ లాక్ చేస్తారని తెలుస్తుంది.