రెండు వారాలుగా విజయ్ లియో లో రామ్ చరణ్ క్యామియో రోల్ ప్లే చేశాడంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారానికి మెగా ఫాన్స్ ఉబ్బి తబ్బిబ్బయ్యారు. లోకేష్ కనగరాజ్ తో రామ్ చరణ్ మీటింగ్ జరిగింది. త్వరలోనే లోకేష్ తో రామ్ చరణ్ మూవీ ఉంటుంది అనే ప్రచారానికి ఈ ప్రచారం ఊతమివ్వడంతో చాలామంది చరణ్ లియో లో నటిస్తున్నాడు అనగానే నమ్మేశారు. కానీ కొంతమంది అది ఉత్తుత్తి ప్రచారమే అని లైట్ తీసుకున్నారు.
తెలుగులో లియో పై క్రేజ్ పెంచడానికి ఎవరో ఈ రూమర్ పుట్టించి వదిలారు. ఎంతగా అది రూమర్ అని తెలిసినా కొంతమందిలో ఎక్కడో చిన్న ఆశ. కానీ లియో విడుదలయ్యింది. అందులో రామ్ చరణ్ లేడు అని చాలామందిలో నిరాశ. ఎంత మోసం చేసారు.. ఇలాంటి రూమర్స్ వదిలి సినిమాపై క్రేజ్ పెంచుకుంటారా.. అది గాసిప్ అని తెలిసిన మేకర్స్ స్పష్టతనివ్వాలి కానీ మౌనం వహిస్తారా అంటూ లియో మేకర్స్ పై చాలామంది ఫైర్ అవుతున్నారు. LCU అన్నారు. అలా అని కమల్ కానీ, సూర్య కానీ, కార్తీ కాని లియో లో కనిపించలేదు.
కేవలం విజయ్ తప్ప ఇంకెవరు కనిపించరు. రామ్ చరణ్ ఉన్నాడనే ప్రచారం చూసి చాలా మంది మెగా ఫ్యాన్స్ బెనిఫిట్ షోలకు వెళ్లారు.చరణ్ లేకపోయేసరికి మేకర్స్ పై తిట్ల దండకం అందుకున్నారు. ఇక నిన్న విడుదలైన లియో కి తెలుగులో ప్లాప్ టాక్ వచ్చేసింది. సెకండ్ హాఫ్ బోర్ అంటూ ఆడియన్స్ ముక్తఖంఠంతో చెబుతున్నారు.