పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇప్పుడు కాంట్రవర్సీలకు భయపడుతుంది. పవన్ కళ్యాణ్ ఫాన్స్ గతంలో రేణు దేశాయ్ ని ప్రతి విషయంలో ట్రోల్ చేసేవారు. అందుకే ఇప్పుడు రేణు దేశాయ్ ఒక విషయంలో కాంట్రావర్సీ కి భయపడి అసలు విషయం చెప్పను అని దాచేస్తుంది. అది ఏ విషయంలో అంటే.. మహేష్ సినిమాలో అవకాశం వచ్చినా తాను చెయ్యలేకపోయాను అని చెప్పుకొచ్చింది.
సర్కారు వారి పాటలో నదియా పాత్ర కోసం మొదటగా తనని సంప్రదించారు.. కానీ కొన్ని కారణాల వలన తాను ఆ అవకాశం వదులుకున్నట్టుగా చెప్పింది. అయితే ఆ కారణాలు బయటకి చెబితే కాంట్రవర్సీ అవుతుంది. ఆ చిత్రంలో నాకు అవకాశం వచ్చింది. నటించాలనే కోరిక నాకు ఉంది. కానీ కుదరలేదు. ఎందుకు సెట్ కాలేదో చెబితే గొడవలైపోతాయి. నాకు కాంట్రవర్సీలో ఇరుక్కోవడం ఇష్టం లేదు.
నిజమేమిటో చెప్పాలని నాకు అనిపిస్తుంది. దాని వలన ఎన్ని కాంట్రవర్సీలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే భయమేస్తుంది. అందుకే కామ్ గా ఉండడం బెటర్ అంటూ చెప్పుకొచ్చింది. దీనిని బట్టి రేణు దేశాయ్ కాంట్రవర్సీలకి భయపడుతున్నట్టే కదా.!