అనుపమ పరమేశ్వరన్ అంటే పదహారణాల తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. అ..ఆ మూవీ నుంచి హలో గురు ప్రేమ కోసమే వరకు అనుపమ చాలా చక్కగా ట్రెడిషనల్ గా, క్యూట్ గా కనిపించింది. ఆ తర్వాత రంగస్థలం ఆఫర్ వదులుకుని డల్ అయిన అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ షో కి తెర లేపింది. లంగా ఓణీలు, చుడీ దార్లు నుంచి ఫ్రాక్స్ , గ్లామర్ డ్రెస్ ల వైపు మొగ్గు చూపింది. రకరకాల గ్లామర్ అవుట్ ఫిట్స్ తో సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యింది.
కార్తికేయ 2 లాంటి ప్యాన్ ఇండియా హిట్ తర్వాత అనుపమలో చాలా మార్పు కనిపిస్తోంది. సిద్దు జొన్నలగడ్డ తో కలిసి టిల్లు స్క్వేర్ లో రొమాంటిక్ గా కొత్త యాంగిల్ చూపించబోతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ పిక్ పోస్ట్ చేస్తూ పింక్ అన్న క్యాప్షన్ పెటింది. కర్లీ హెయిర్ ని రబ్బర్ బ్యాండ్ తో బందించి.. బ్లాక్ స్లీవ్ లెస్ టాప్ పై పింక్ షర్ట్ వేసి.. తమకంగా పెట్టిన అనుపమ సైడ్ ఫేస్ చూస్తే.. అమ్మో అనుపమలో ఇంత ఛేంజా అనక మానరు.
ప్రస్తుతం వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా కనిపిస్తున్న అనుపమకు స్టార్ అవకాశాలు మాత్రం ఆమడ దూరంలోనే ఆగిపోతున్నాయి. ఎంతగా గ్లామర్ షో చేసినా అనుపమని పట్టించుకునే ప్యాన్ ఇండియా స్టార్ కానీ, స్టార్ హీరోస్ కానీ లేరు.. జస్ట్ మీడియం రేంజ్ హీరోలతోనే అనుపమ పరమేశ్వరన్ సర్దుకుపోతుంది.