కాజల్ అగర్వాల్ తెలుగు సినిమాల్లో కనిపించి చాలా కాలమే అయ్యింది. ఆచార్యతో గత ఏడాది అందరి ముందుకు రావాల్సి ఉంది. కానీ ఆ చిత్రం నుంచి కాజల్ ని తప్పించారు. ఇక నాగార్జున ఘోస్ట్ నుంచి ఆమె కావాలని తప్పుకుంది. కాజల్ పెళ్లి తర్వాత మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులని పలకరించబోతుంది. సోషల్ మీడియాలో నిత్యం అభిమానులకి దగ్గరగా ఉండే కాజల్ తెలుగు ప్రేక్షకులని అలరించి చాలా కాలమైంది. తమిళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెళ్లి తర్వాత ఆమె కమ్ బ్యాక్ మూవీ మాత్రం భగవంత్ కేసరినే.
కాజల్ పెళ్లి తర్వాత బాబు పుట్టాక మొదటగా ఇండియన్ 2 సెట్స్ లో అడుగు పెటింది. అది తమిళ్ మూవీ. ఇక తర్వాత భగవంత్ కేసరిలో నటించింది. ఇండియన్ 2 కన్నా ముందే భగవంత్ కేసరి తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మరి చందమామగా ఇన్నేళ్లు టాలీవుడ్ లో చక్రం తిప్పిన కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత ఎలాంటి హవా చూపించబోతుందో భగవంత్ కేసరి రిజల్ట్ పై ఆధారపడి ఉంది. ఇప్పటికే మెగాస్టార్ చిరు తో ఖైదీ నెంబర్ 150 లో నటించింది.
ఇక నాగార్జున పక్కన ఘోస్ట్ లో నటించాల్సి ఉంది. కానీ అది మిస్ అయ్యింది. ఈ భగవంత్ కేసరి చిత్రం హిట్ అయితే ఇకపై సీనియర్ హీరోలకి కాజల్ అగర్వాల్ కేరాఫ్ గా మారొచ్చు. అలాగే కాజల్ ఇప్పటికే తమిళ్ లో విమెన్ సెంట్రిక్ మూవీస్ లో నటిస్తుంది. మరి భగవంత్ కేసరితో కాజల్ కమ్ బ్యాక్ ఏమవుతుందో మరి కొద్దిగంటల్లో తేలిపోతుంది.