Advertisement
Google Ads BL

BK సర్ ప్రైజ్ కోసం వెయిట్ చేయాల్సిందే


బాలకృష్ణ - అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కిన భగవంత్ కేసరి మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓవర్సీస్ రివ్యూస్, పబ్లిక్ టాక్, బెన్ ఫిట్ షో టాక్ అంటూ మరోకొద్దిసేపట్లో సోషల్ మీడియాలో హడావిడి మొదలైపోయింది. ఇలాంటి సమయంలో భగవంత్ కేసరిలో ఓ సర్ ప్రైజ్ అభిమానులని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అయితే అది సినిమా విడుదలైన వారానికి గాని ఆ సర్ ప్రైజ్ ఫాన్స్ దగ్గరికి రాదట. అదే బాలయ్య దంచవే మేనత్త కూతురు సాంగ్ రీమెక్.

Advertisement
CJ Advs

ఈ సినిమా కోసం 3.50 కోట్లతో దంచవే మే నత్త కూతురా పాట రీమిక్స్ చేసారని, దాన్ని స్క్రాప్ చేసారనే వార్తలు అన్ని రూమర్స్ అంటుంది చిత్ర బృందం. పాటను స్క్రాప్ చేయలేదు అని భగవంత్ కేసరి విడుదలైన ఓ వారం తరువాత యాడ్ చేస్తారు అని సమాచారం. అంతేకాకుండా దంచవే మేనత్త కూతురు పాట రీమిక్స్ చేయలేదట. కానీ ఒరిజినల్ సాంగ్ లో ఓ బిట్ గా మాత్రమే దంచవే మేనత్త కూతురా అని వస్తుందట. మరి ఈ సర్ ప్రైజ్ కోసం బాలయ్య ఫాన్స్ వారం వెయిట్ చెయ్యాల్సిందే.

ఇక ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ భగవంత్ కేసరి చిత్రానికి చాలా బలంగా ఉండబోతుంది. ఈ ఎపిసోడ్ లో అభిమానులకి పూనకాలు తెప్పించేలా 15 నిమిషాల పాటు బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని టాక్. పోలీస్ గెటప్ లో బాలకృష్ణ బీభత్సం చూపిస్తారు అంటూ జరుగుతున్న ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

Bhagavanth Kesari has to wait for the surprise:

Danchave Menatta Kootura in Bhagavanth Kesari
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs