Advertisement
Google Ads BL

ఆ పండగ లోపు ప్రభాస్ పెళ్లి


ఆరడుగుల ఆజానుబాహుడు, అందగాడు.. 40 ఏళ్ళు దాటిపోయాయి.. పెళ్లెప్పుడు చేసుకుంటాడో అని ఆయన కుటుంబంతో పాటుగా అభిమానులు ఎదురుచూడని రోజు లేదు. కృష్ణం రాజుగారైతే ప్రభాస్ పెళ్లి అనే ఆఖరి కోరిక తీరకుండానే చనిపోయారాయన. ప్రభాస్ ఎందుకో ఏమిటో పెళ్లి అంటే ఆమడదూరంగానే ఉండిపోతాడు. ప్యాన్ ఇండియా స్టార్ గా వరసబెట్టి సినిమాలు చేస్తూ ప్రాపర్టీస్ కొంటూ ఆస్తులు కూడబెడుతున్నాడు కానీ.. పెళ్లి జీవితంపై దృష్టి మాత్రం పెట్టడం లేదు. 

Advertisement
CJ Advs

ప్రతి ఏడాది ప్రభాస్ పెళ్లిపై వార్తలు రావడం, అది జరక్కపోవడం.. దానితో అభిమానులు డిస్పాయింట్ అవడం చూస్తూనే ఉన్నాము. తాజాగా ప్రభాస్ పెళ్లి మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. దసరా నవరాత్రులు సందర్భంగా విజయవాడ కనకదుర్గ దర్శనానికి వచ్చిన కృష్ణంరాజుగారి భార్య శ్యామలా దేవి అమ్మవారి దర్శనానంతరం మీడియాతో మట్లాడారు. ఆ సందర్భంగా ప్రభాస్ పెళ్లిపై మీడియా ప్రశ్నించింది. కృష్ణంరాజుగారు తమతో లేకపోయినా.. ఆయన పేరు నిలబెడుతూ మా ఫ్యామిలీ ముందుకెళుతోంది. 

ప్రభాస్ పెళ్లి త్వరలోనే ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా చెబుతున్నాను, అమ్మాయి ఎవరు, పెళ్ళెప్పుడు అనేది చెప్పను, కానీ వచ్చే ఏడు దసరా పండగ లోపు ప్రభాస్ పెళ్లి జరుగుతుంది అంటూ శ్యామలాదేవి మీడియాకి తెలియజేసారు. మరి ఆవిడ చెప్పినట్టుగా వచ్చే దసరా లోపు ప్రభాస్ పెళ్లి జరగాలని ఆయన అభిమానులు కూడా బలంగా కోరుకుంటున్నారు. 

Prabhas got married during that festival:

Shyamala Devi Key Comments on Actor Prabhas Marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs