డాక్టర్ గౌతమ్ గా బిగ్ బాస్ సీజన్ 7 లో కి అడుగుపెట్టిన గౌతమ్ హౌస్ లో చాలామందితో గొడవ పడుతూ ఎలిమినేషన్ వరకు వెళ్లి సీక్రెట్ రూమ్ లో కూర్చుని మళ్ళీ అశ్వద్ధామ 2.ఓ అంటూ కలరింగ్ ఇస్తూ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటినుంచి గౌతమ్ బిహేవియర్లో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా శివాజీ పై గౌతమ్ కక్ష కట్టాడు. హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడమే శివాజితో గొడవ పెట్టుకున్నాడు. తనని నామినేట్ చేసిన వాళ్ళందరి అంతు చూస్తా అన్నాడు.
అన్నట్టుగానే పోటుగాళ్లతో కలిసి ఆడి కెప్టెన్సీ టాస్క్ లో ఓడిపోయిన గౌతమ్ ఈ వారం నామినేషన్స్ లో శివాజీని నామినేట్ చేసాడు. శివాజీ గేమ్ సరిగా ఆడలేకపోతున్నారంటూ ఆయన్ని నామినేట్ చెయ్యగానే గౌతమ్ పైకి ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ ఎగబడ్డారు. ఆయన పెద్దాయన, చేతికి దెబ్బతగిలించుకుని ఉన్నారు, అలాంటి ఆయన్ని నామినేట్ చేస్తావా అంటూ గౌతమ్ ని నామినేట్ చేస్తూ గొడవ పడ్డారు . పల్లవి ప్రశాంత్ అయితే మధ్యలో కలగజేసుకుని గౌతమ్ పై విరుచుకుపడ్డాడు. వీళ్లంతా శివాజీని సపోర్ట్ చేసే బ్యాచ్.
యావర్ కెప్టెన్ గా.. మీరు డిప్యూటీ అంటూ శివాజీని ఎంచుకున్నాడు. శివాజీ ఎలా చెబితే అలా ఫాలో అవుతున్నాడు యావర్. మరి శివాజీ ఎంత బాగా ఆడుతున్నా కొంతమంది ఇంటి సభ్యులని బాగానే మానిప్యులేట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ నామినేషన్స్ లో గౌతమ్ ని శివాజీ బ్యాచ్ టార్గెట్ చెయ్యడం చూస్తే అదే నిజమనిపిస్తుంది.