Advertisement
Google Ads BL

గేమ్ ఛేంజర్ పై ఊహాగానాలు నిజమవుతాయా..


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబోలో ఫస్ట్ టైమ్ ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న గేమ్ ఛేంజర్ పై ట్రేడ్ లో విపరీతమైన అంచనాలున్నాయి. కానీ విడుదల తేదీపై చేస్తున్న ఆలస్యం గేమ్ ఛేంజర్ క్రేజ్ పై ఎఫెక్ట్ పడుతుంది అంటూ మెగా అభిమానులు గొడవ చేస్తున్నారు. శంకర్ ఇండియన్ 2 కి ఇంపార్టెన్స్ ఇస్తూ గేమ్ ఛేంజర్ ని లైట్ తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో రోజుకో న్యూస్ కనిపిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో గేమ్ ఛేంజర్ షూటింగ్ జరుగుతుంది.

Advertisement
CJ Advs

ఈలోపులో సోషల్ మీడియాలో కొంతమంది పనిగట్టుకుని మెగా ఫాన్స్ ని కన్ఫ్యూజ్ చేసే పనిలో ఉన్నారు. గేమ్ ఛేంజర్ నుంచి ఈ దసరా అంటే రేపు సోమవారం నాడు ఫస్ట్ సింగిల్ పక్కా అంటూ చేసిన ట్వీట్ వైరల్ అయినా.. ఇలాంటి ఊహాగానాలు నిజమవుతాయా.. ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ లేకుండా అనే మీమాంశ లో కొంతమంది కనబడుతున్నారు. రామ్ చరణ్ పై చిత్రీకరించిన జరగనుంది జరగనుంది అనే సాంగ్ లీకయ్యింది. ఇప్పుడు అదే పాటని వదులుతారట.. అంటూ కొన్ని ట్వీట్లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

రామ్ చరణ్-కియారా అద్వానీ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో SJ సూర్య విలన్ గా కనిపించబోతున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదలయ్యే ఛాన్స్ వుంది. వచ్చే ఏడాది ఇండియన్ 2 ,ఆ తర్వాత సంవత్సరం గేమ్ ఛేంజర్ అంటున్నారు. చూద్దాం ఏది నిజమో అనేది. 

Will the speculations on the Game Changer come true..:

Game Changer first single on Dasara
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs