Advertisement

రేవంత్‌ కొడంగల్ లో గెలుస్తారా..


ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. అభ్యర్థుల విషయంలోనూ సీనియారిటీని పక్కనబెట్టి.. ఎలాంటి అభ్యర్థనలకూ తావివ్వకుండా కేవలం గెలుపు గుర్రాలకే టికెట్ కేటాయించింది. సర్వేలు చేయించి ఆ సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఆ జాబితాలో చోటు దక్కని నేతలు మండిపడుతున్నారు. ఆ పాపం అంతా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అంటగట్టి ఆయనను ఓడించి తీరుతామంటూ మంగమ్మ శపథాలు చేస్తున్నారు. ఈ సారి తాను తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ నుంచి పోటీ చేస్తానని రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

Advertisement

అయితే రేవంత్ అనుచరుల నుంచే ఆయనకు తిరుగుబాట్లు ఎదురవుతున్నాయి. కొడంగల్‌లో రేవంత్‌ను ఓడించి తీరుతామంటూ ఆయన ముఖ్య అనుచరుడు సవాల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనికోసం రేవంత్ వ్యతిరేకులు అందరినీ ఒక్కతాటిపైకి తీసుకు వచ్చేందుకు ట్రై చేస్తున్నారు. రేవంత్ అనుచరుల్లో ఒకరైన సోమశేఖర్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గ సీటును ఆశించి భంగపడ్డారు. తాజాగా ఆయన పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ.. ఉప్పల్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని కాకుండా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని రేవంత్ చూస్తున్నారని ఆరోపించారు. తన వంటి బాధితులను కలుపుకుని కొడంగల్లో రేవంత్‌ను చిత్తుగా ఓడిస్తామన్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్‌కు జోష్ వచ్చిందంటే దానికి రేవంత్ రెడ్డే కారణం. అందరినీ కలుపుకుంటూ వెళుతూ పార్టీని బీఆర్ఎస్‌కు పోటీగా నిలబెట్టారు. ఒకవైపు పార్టీని గెలిపించుకోవాలని రేవంత్ నానా తంటాలు పడుతుంటే.. ఆయనను ఓడించేందుకు టికెట్ రాని నేతలు కంకణం కట్టుకోవడం దురదృష్టకరం. నిజానికి గత ఎన్నికల్లో రేవంత్ కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరి ఈ ఎన్నికల్లో చాలా ధీమాగా తాను కొడంగల్ నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. ఆయనకు ఎంత నమ్మకముంటే ఇలా చెబుతారు. అప్పటి రేవంత్ స్థాయి వేరు.. ఇప్పటి స్థాయి వేరు. ఆయనను ఓడించడం అంత సులువు అయితే కాదు. ఇప్పుడు అభ్యర్థుల జాబితా కొంతే వెలువడింది. మరికొద్ది రోజుల్లో పూర్తి జాబితా వెలువడనుంది. అప్పుడు ఇంకెంత మంది రేవంత్‌పై ఆరోపణలు చేస్తారో.. వారందరినీ ఎదుర్కొని రేవంత్ గెలవాల్సి ఉంది.

Will Revanth win in KOdangal:

Telangana election: Congress releases first list
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement