Advertisement
Google Ads BL

మెగా ఫ్యామిలిలో పార్టీలే పార్టీలు


మెగా ఫ్యామిలిలో సెలెబ్రేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. రామ్ చరణ్-ఉపాసనల పాప క్లింకారా బారసాల వేడుకల తర్వాత మెగా ఫ్యామిలిలో వరుణ్ తేజ్ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. గత వారమే మెగాస్టార్ తన ఇంట్లో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల ప్రీ వెడ్డింగ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో అల్లు-మెగా ఫ్యామిలీ సభ్యులంతా పాల్గోన్నారు. రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహ.. మిగతా మెగా హీరోలు, చిరు కూతుళ్లు అలాగే మెగాస్టార్ తల్లి కూడా పార్టీలో సందడి చేసారు.

Advertisement
CJ Advs

మరి ఆ పార్టీ తర్వాత అందరూ ఇటలీకి పయనమవుతారు..ఈ నెలాఖరులో జరగబోయే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల పెళ్ళికి వెళ్ళిపోతారేమో అనుకున్నారు. కానీ ఇప్పటికి మెగా ఫ్యామిలిలో వరుణ్ తేజ్-లావణ్య ల ప్రీ వెడ్డింగ్ పార్టీలు నడుస్తూనే ఉన్నాయి. ఇంతకుముందే అల్లు శిరీష్ కొన్ని ఫోటోలని షేర్ చేస్తూ.. A party at home with family & friends celebrating Varun & Lavanya’s upcoming wedding! అంటూ క్యాప్షన్ పెట్టాడు.

ఈ పార్టీలో మెగాస్టార్ తో సహా.. లావణ్య త్రిపాఠి ఫ్రెండ్స్, వరుణ్ తేజ్ ఫ్రెండ్స్ నితిన్, రీతూ వర్మ అలాగే అల్లు అర్జున్-స్నేహ, ఉపాసన, ఇంకా మెగాస్టార్ మనవరాళ్లు అందరూ పాల్గొన్నారు. అలాగే మెగాస్టార్ చిరు, అల్లు అరవింద్, ఫ్యామిలీ మెంబెర్స్ లావణ్య-వరుణ్ తేజ్ లతో కేక్ కట్ చేయించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Varun Tej-Lavanya Tripathi pre wedding celebrations:

Allu Sirish shares Varun Teja-Lavnaya Tripathi intimate pre wedding party pictures
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs