తెలుగులో బాలకృష్ణ భగవంత్ కేసరి-రవితేజ టైగర్ నాగేశ్వరావు మూవీస్ ఈ దసరాకి పోటీ పడుతున్నాయి. తమిళం నుంచి లియో డబ్బింగ్ మూవీ కూడా పోటీకి వస్తుంది. అయితే తెలుగులో భగవంత్ కేసరి పై టైగర్ నాగేశ్వరావు పై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ దసరాకి వీరి మధ్యనే బిగ్ ఫైట్ ఉండబోతుంది. ఎందుకంటే లోకేష్ లియోపై అంతగా అంచనాలు లేవు. ప్రమోషన్స్ లేకపోవడం, ట్రైలర్ ఆశించినంతగా కనెక్ట్ అవ్వకపోవడంతో లియో పై అంచనాలు తగ్గాయి.
మరోపక్క భగవంత్ కేసరిపై అంచనాలు పెరుగుతున్నాయి. బాలకృష్ణ-శ్రీలీల ప్రమోషన్స్ చేసే విధానం, సినిమాలో వాళ్ళ మధ్యన ఉన్న సన్నివేశాలు ఇవన్నీ హైలెట్ అనేలా ఉన్నాయి. అలాగే మొదటిసారి ఫ్యాన్ ఇండియా మార్కెట్ లో దిగుతున్న రవితేజ టైగర్ నాగేశ్వరావు పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగించేందుకు కష్టపడుతున్నాడు. నార్త్ ఆడియన్స్ ని పడేసేందుకు ఎక్కువగా అక్కడే ముంబైలో ప్రమోషన్స్ చేసాడు
తెలుగుని లైట్ తీసుకుంటున్నట్టుగా కనిపించినా.. నిన్న టైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మరోసారి సినిమాపై అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసాడు. ఎలాగూ సినిమా విడుదలకు మధ్యన ఉన్న నాలుగు రోజులని ఇంటర్వూస్, మీడియా ఇంటరాక్షన్ అంటూ హడావిడి చేస్తే ఇంకాస్త బజ్ క్రియేట్ అవుతుంది. మరి విజయ్ లియో డబ్బింగ్ మూవీ గానే మిగిపోవడంతో దసరాకి ఫైనల్ ఫైట్ రవితేజ, బాలయ్యల మధ్యనే ఉండబోతుంది.