బిగ్ బాస్ సీజన్ 7 లోకి నెల తర్వాత కొత్తగా ఎంట్రీ ఇచ్చిన నయని పావని వారం లోనే తన మార్క్ హౌస్ లో చూపించింది. సూపర్ యాక్టీవ్ గా టాస్క్ ఆడడం, చక్కగా అందరితో కలిసిపోయి సరదాగా కనిపించిన నయని పావని ఉన్నట్టుండి ఒక్క వారానికే ఎలిమినేట్ కావడం అటు ప్రేక్షకులు ఇటు హౌస్ మేట్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. తాను ఎలాగైనా ఉంటాను అనుకున్న నయనకి కూడా ఇది పెద్ద షాకే. అందుకే స్టేజ్ పై నుంచి ఇంటికెళ్ళేవరకు నయని పావని కన్నీటి పర్యంతమవుతూనే ఉంది.
స్టేజ్ పై కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడ్చింది. శివాజీ తో ఉన్న డాడ్ బంధాన్ని చెప్పి అందరితో కన్నీళ్లు పెట్టించింది. నయని పావని ఎలిమినేట్ అయ్యి ఇంటికెళ్ళాక కూడా విపరీతంగా ఏడ్చేసింది. తల్లికి సారీ చెప్పింది. వాళ్ళెంతగా ఓదార్చినా నయని ఏడుపు ఆపలేదు. నయని పావని షాకింగ్ ఎలిమినేషన్ పై నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తూ నయని పావనిని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
మొన్న ఎంటర్ అయిన ఐదుగురిలో అర్జున్ తో పాటుగా నయని స్ట్రాంగ్ గా కనిపించింది. అశ్విని, పూజ, భోలే వీళ్ళ మీద నయని చాలా బెటర్ అంటూ నెటిజెన్స్ కూడా ముఖ్తఖంఠంగా చెబుతున్న మాట. ప్రస్తుతం సోషల్ మీడియా ట్విట్టర్ లో #NayaniPavani హాష్ టాగ్ నేషన్ వైడ్ గా ట్రెండ్ అవుతుంది.