Advertisement
Google Ads BL

నాగార్జునపై ఫైర్ అయిన సందీప్ మాస్టర్ భార్య


కింగ్ నాగార్జునపై బిగ్ బాస్ సీజన్ 7 లోకి కంటెస్టెంట్ గా ఎంటర్ అయ్యి మొదటి ఇంటి సభ్యుడిగా ఐదు వారాలుగా ఇమ్యూనిటీ పొందిన సందీప్ మాస్టర్ భార్య జ్యోతి రాజ్ ఫైరవుతుంది. సందీప్ మాస్టర్ మొదట్లో సెటిల్డ్ పెరఫార్మెన్స్ ఇచ్చినా ఆ తర్వాత బ్యాడ్ సంచాలక్ గా, అలాగే కొన్ని అనవసర విషయంలో దూరి నాగార్జున చేత వీకెండ్ ఎపిసోడ్స్ లో తిట్లు తింటున్నాడు. నిన్నటికి నిన్న శనివారం ఎపిసోడ్  లో నాగార్జున అమరదీప్-యావర్ గొడవపడుతుంటే నువ్వెందుకు వెళ్ళావ్.. గొడవ ఆపడానికి అన్నావ్.. కానీ నువ్వెళ్ళాక అది ఇంకాస్త పెద్దగా అయ్యింది అంటూ సందీప్ మాస్టర్ కి నాగార్జున లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు.

Advertisement
CJ Advs

అయితే సందీప్ మాస్టర్ భార్య జ్యోతి రాజ్ మాత్రం సందీప్ ని అలా నాగార్జున తిట్టడాన్ని భరించలేకపోతుంది. అదే విషయాన్ని ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తన భర్త అంటే తనకి ఎక్కువే.. సందీప్ ని నాగార్జున ఏంటి ఆలా అనేసారినిపించింది. సందీప్ భార్యగా అది నాకు నచ్చలేదు. నా భర్త నాకు గొప్పే. అక్కడ నాగార్జున ఉన్నా.. మోడీ అయినా అక్కడ ఎలాంటి గొప్పవాళ్ళు ఉన్నా నా భర్తే నాకు గొప్ప. నాగార్జున ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా ఆలా అనేస్తారా.. పోన్లే ఇదో గేమ్ షో అని సరిపెట్టుకున్నాను.

అదే నాగార్జున నా భర్త సందీప్ ని గ్రేట్ అన్నారు, నువ్వు పిస్తావా అన్నారు. గేమ్ ఆయన చేతిలో ఉంది.. ఆయన బోన్ లో మనమున్నాము, పడాలి. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు పొగడ్తలూ ఉంటాయి, విమర్శలూ ఉంటాయి. అన్నిటిని తీసుకోవాలి. సందీప్ చాలా అగ్రేషన్ తో ఉంటాడు. బిగ్ బాస్ అనేది ఫ్యామిలీ షో. అక్కడ కోపం ఎక్కువగా చూపించకూడదు. తనకి బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది వెళ్ళాడు. కప్ గెలిచినా గెలవకపోయినా అందరి మనసులని గెలుచుకోవాలని అతన్ని పంపించాము అంటూ జ్యోతిరాజ్ నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా ఆయన ప్రవర్తన నచ్చలేదు అనేసింది.  

Sandeep Wife Fires On Nagarjuna:

Aata Sandeep Wife Jyothi Raj Fires On Nagarjuna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs