Advertisement
Google Ads BL

సినిమాలు లాస్ అన్న రిపోర్టర్ కి ఇచ్చిపడేసిన నాని


చాలారోజుల నుంచి నాని హిట్ కొడుతున్నాడు కానీ నిర్మాతలకు అనుకున్న కలెక్షన్స్ రాక ఎంతో కొంత నష్టపోతున్నారనే టాక్ ఉంది. జెర్సీ, టక్ జగదీశ్ ఆ కోవలోకే వస్తాయి అంటూ ప్రచారం జరగడమే కాదు.. ఈరోజు ఆదివారం జరిగిన హాయ్ నాన్న టీజర్ లాంచ్ ఈవెంట్ లో జర్నలిస్ట్ ఒకరు..  నాని మీరు మంచి మంచి సినిమాలు అందిస్తున్నారు. జెర్సీ, శ్యామ్ సిగ్ రాయ్, హాయ్ నాన్న అన్ని యూనిక్ పీస్ లు అందిస్తున్నారు.

Advertisement
CJ Advs

కానీ. .నిర్మాతలకు, బయ్యర్లకు బ్రేక్ ఈవెన్ అవ్వడం కానీ, కాస్ట్ ఫెయిల్యూర్ అవడం కానీ జరుగుతున్నాయి.. అని అడగ్గానే ఏ నిర్మాతకి లాస్ వచ్చిందో చెప్పమనండి, నా దగ్గర వాళ్ళ నెంబర్లు ఉన్నాయి అని నాని అడిగాడు. ఆ నిర్మాతలు పైకి చెప్పరు కదా సర్ అన్నాడు జర్నలిస్ట్. జెర్సీ సినిమాకి బయ్యర్స్ లాస్ అయ్యారు అనే టాక్ ఉంది అని అడగ్గానే నాని ఆయనకి గట్టిగా ఇచ్చిపడేసాడు. 

పది రూపాయలు ఖర్చయితే జెర్సీ 50 రూపాయలు చేసింది. మళ్ళీ ఆ పది రూపాయల్లో మనం చూసే లెక్క ఆ పది రూపాయల్లో 30 రూపాయలు థియేట్రికల్ లెక్కలు, మిగతా 70 నాన్ థియేట్రికల్ లెక్కలు అంటూ, సినిమాలు అన్నాక బోలెడన్నిలాజిక్స్ ఉంటాయంటూ నాని ఆ జర్నలిస్టు కి ఇచ్చిపడేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Nani Strong Reply To Reporter Question:

Natural Star Nani STRONG Reply To Reporter Question
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs