ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ విడుదలకు రెండు నెలల సమయం ఉంది. రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్స్ తర్వాత వస్తున్న మూవీ అయినా సలార్ పై విపరీతమైన అంచనాలున్నాయి. యాక్షన్ ప్యాకెడ్ కంటెంట్, కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, ఇప్పటివరకు వదిలిన పోస్టర్స్ అన్ని ఈ చిత్రంపై అంచనాలు పెరిగేవిలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది పనిగట్టుకుని సలార్ పై విషాన్ని చిమ్ముతున్నారు.
సలార్ అంటే కొంతమందికి భయం లేదు, అందుకే తమ సినిమాలని సలార్ డేట్ డిసెంబర్ 22 కి అటు ఇటుగా ఫిక్స్ చేసుకుంటున్నారు. సీజీ వర్క్ క్వాలిటీ, అలాగే ఓవర్సీస్ రేట్స్ తగ్గించడం వంటి విషయంతో సలార్ అంటే కొంతమందికి భయం లేకుండా పోయింది. అసలు ప్రభాస్ స్టిల్స్, పృథ్వీ రాజ్ సుకుమార్ స్టిల్, శృతి హాసన్ స్టిల్ ఇలా అప్పుడొకటి ఇప్పుడొకటి స్టిల్స్ వదిలితే సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి అంటూ ట్వీట్స్ పెడుతున్నారు.
దీనికి ధీటుగా ప్రభాస్ ఫాన్స్ కూడా సలార్ ట్రైలర్ వస్తే ఇవన్నీ ఎగిరిపోతాయి.. ఆ హైప్ ఆటోమాటిక్ గా వస్తుంది అని రిప్లై ఇస్తున్నారు. కాకపోతే నెగెటివ్ అని తీసుకోకుండా అప్పుడప్పుడు పోస్టర్ వదులుతూ సినిమా విడుదలయ్యే సమయానికి బజ్ క్రియేట్ చేస్తే బావుంటుంది.