నందమూరి బాలకృష్ణ నుంచి అఖండ, వీర సింహారెడ్డి సక్సెస్ తర్వాత రాబోతున్న చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి అక్టోబర్ 19 న దసరా స్పెషల్ గా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో బాలయ్య-శ్రీలీల, తండ్రి-కూతురు మధ్యన వచ్చే సన్నివేశాలు అలాగే ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ అంటూ ఎప్పటినుండో సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాటే.
తాజాగా భగవంత్ కేసరి మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. భగవంత్ కేసరి సెన్సార్ టాక్ ఏమిటంటే.. ఈ చిత్రానికి సంబందించిన ఇంటర్వెల్ బ్యాంగ్ కి థమన్ ఇచ్చిన ఆర్ ఆర్ ఓ రేంజ్ లో ఉంది అని, అలాగే యాక్షన్ సీక్వెన్స్ ప్రతిదీ మెయిన్ హైలెట్ అనేలా ఉందట. ఇప్పటివరకు భగవంత్ కేసరిపై ఎవరికైనా అనుమాలున్నా, అలాగే ట్రోలింగ్ ఉంటే.. అవన్నీ పక్కకి పోతాయంటూ సోషల్ మీడియాలో భగవంత్ కేసరి సెన్సార్ టాక్ వినిపిస్తోంది.
హీరోయిన్స్ కాజల్ అగర్వాల్-శ్రీలీల తో పాటుగా బాలకృష్ణ, అనిల్ రావిపూడి అలాగే విలన్ పాత్రధారి అర్జున్ రాంపాల్ లు భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తున్నారు.