Advertisement
Google Ads BL

BB7: హౌస్ లో రెండో కెప్టెన్


బిగ్ బాస్ సీజన్ 7 ని ఏదో కొత్తగా ప్లాన్ చేసింది స్టార్ మా యాజమాన్యం. 2.ఓ అంటూ హడావిడి చేస్తుంది. ఐదుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అవ్వగా.. మరో ఐదుగురు కొత్తవాళ్లు ఐదు వారాల తర్వాత హౌస్ లోకి అడుగుపెట్టారు. అర్జున్ రాయుడు, పూజ, నయని పావని, అశ్విని, భోలే ఇలా ఈ ఐదుగురితో పాటుగా సీక్రేట్ రూమ్ లోకి వెళ్లిన గౌతమ్ కలిసాడు. వీళ్ళని పోటుగాళ్ళు, హౌస్ లో ఐదు వారాలుగా ఉన్నవాళ్ళని ఆటగాళ్లు అంటూ విభజించి టాస్క్ లు ఆడించాడు బిగ్ బాస్.

Advertisement
CJ Advs

ముందు టాస్క్ ల్లో పోటుగాళ్ళు సత్తా చాటినా.. తర్వాత మూడు టాస్క్ ల్లో ఆటగాళ్లు సత్తా చాటి కెప్టెన్సీ కంటెండర్లుగా పోటీపడ్డారు. అదులో సందీప్ మాస్టర్ శివాజీ బెలూన్ పగలగొట్టి మీరు సరిగ్గా ఆడలేకపోతున్నారు అన్నాడు. తర్వాత సందీప్ బెలూన్ శోభా పగలగొట్టి మీరు ఐదు వారాలుగా ఇమ్యూనిటీలో ఉన్నారు అంది. ఆతరవాత శోభా బెలూన్ లో గాలి తీసేసాడు యావర్. కర్మ రిటన్స్ అంటూ శోభా కన్నీళ్లు పెట్టుకుంది. ఇక తేజ అమరదీప్ బెలూన్ లో గాలి తీసెయ్యగా.. అమరదీప్ చాలా బాధపడ్డాడు.

చివరిగా తేజ-యావర్ లో మిగిలిన వాళ్లలో ఒకరు కెప్టెన్ గా నిలవాల్సి ఉంది. దానితో నయని పావని లాస్ట్ ఛాన్స్ తీసుకుని తేజ బెలూన్ గాలి తీసేసింది. ఫైనల్ గా హౌస్ కి రెండో కెప్టెన్ గా యావర్ ప్రిన్స్ అవతరించాడు. దానితో పోటుగాళ్ళు, ఆటగాళ్లలో కొందరు కాస్త బాధపడ్డారు. యావర్ మాత్రం కెప్టెన్ అయినందుకు తన అన్నకి థాంక్స్ చెప్పుకున్నాడు. ఈ మధ్యలో పూజ-అశ్విని లు ఓ రేంజ్ లో గొడవపడ్డారు.  

BB7: Prince Yawar Becomes the Captain!:

Bigg Boss 7: Prince Yawar Becomes the Captain!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs