టైగర్ నాగేశ్వరావుతో మరో వారం రోజుల్లో ప్యాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మాస్ మహారాజ్ రవితేజ రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఇంటర్వ్యూలో భాగంగా నిర్మాత అభిషేక్ అగర్వాల్ రవితేజ డెడికేషన్ ని బయటపెట్టాడు. తనకి తగిలిన గాయాన్ని కూడా లెక్క చెయ్యకుండా నిర్మాత నష్టపోకూడదని రవితేజ రెండు రోజుల్లోనే సెట్స్ లకి వచ్చేశాడంటూ ఆయన టైగర్ సెట్స్ లో జరిగిన ఓ ఇన్సిడెంట్ ని బయటపట్టేవాడు.
అసలు విషయం ఏమిటంటే.. టైగర్ నాగేశ్వరావు కోసం వేసిన సెట్ లో ట్రైన్ దోపిడీ సీన్‌లో ట్రైన్ మీది నుంచి లోపలికి దూకే ఒక షాట్‌లో రవితేజ అదుపుతప్పి కిందపడిపోగా.. రవితేజ మోకాలికి బాగా దెబ్బ తగలడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా డాక్టర్స్ అతనికి ఆపరేషన్ చేసి 12 కుట్లు వేసినట్టు గా ఆయన చెప్పుకొచ్చారు. అంత పెద్ద దెబ్బ, ఆపరేషన్ తర్వాత విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా వినకుండా షాట్‌లో దాదాపు 400 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, ఒకవేళ షూటింగ్‌ను ఎక్కువ రోజులు వాయిదా వేస్తే నిర్మాత నష్టపోతాడని రవితేజ రెండు రోజుల్లోనే మళ్లీ షూటింగ్‌కు రెడీ అయిపోయారంటూ చెప్పారు.
సినిమాపై రవితేజకున్న అంకితభావానికి అది నిదర్శనమని అభిషేక్ రవితేజని పొగిడేశారు. ఈ న్యూస్ చూసిన మాస్ రాజా అభిమానులు సైతం రవితేజ డెడికేషన్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.