Advertisement
Google Ads BL

BB 7: మళ్ళీ అమ్మాయికే స్పాట్ పెట్టారా..


బిగ్ బాస్ సీజన్ 7 మొదలైనప్పటినుంచి ఇప్పటికి ఐదు వారాలు గడిచిపోయి ఆరో వారం కూడా పూర్తికావడానికి రెడీ అయ్యింది. అయితే సీజన్ 7 మొదటి వారం నుంచే హౌస్ లోని అమ్మాయిలనే టార్గెట్ చేస్తూ వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. ఐదు వారాలకు గాను ఐదుగురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు.

Advertisement
CJ Advs

ఇప్పటివరకు ఏ సీజన్ లోను ఇలా జరగలేదు. ఈ సీజన్ లో వరసగా అమ్మాయిలే వెళ్లిపోతున్నారు. స్టిల్ ఆరో వారంలోను మరో అమ్మాయే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ వుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నయని పావని, పూజ, అశ్విని, శోభా శెట్టి లు అమ్మాయిల్లో నామినేట్ అయ్యి ఉన్నారు. అందులో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇక మిగిలిన తేజ, అమరదీప్, ప్రిన్స్ యావర్ లు ఉన్నారు.

కానీ అమరదీప్, ప్రిన్స్ కాస్త స్ట్రాంగ్ గా ఉన్నారు.  తేజ ఎంటర్టైనర్. సో ఈ వారం కొత్తగా ఎంటర్ అయిన నయని పావని కానీ లేదంటే అశ్విని, పూజలు కానీ, శోభా శెట్టి కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా శోభా శెట్టి స్ట్రాంగ్ అన్నా.. ఆమె ఆటలో తొండి ఆడడం నెటిజెన్స్ కి నచ్చడం లేదు. కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళని మొదటి వారం పంపించలేరు అటు శోభాకి కాస్త ఓటింగ్ తగ్గడంతో ఈ వారం ఆమె ఎలిమినేట్ అయినా అవ్వొచ్చనే టాక్ అయితే బాగా స్ప్రెడ్ అయ్యింది. 

Bigg Boss 7: This Female Contestant is in Danger Zone:

Bigg Boss Telugu 7 Voting
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs