టీడీపీ శ్రేణులకు బిగ్ రిలీఫ్.. లోకేష్‌పై స్కిల్ కేసు క్లోజ్
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో హైకోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. ఇవాళ ఉదయం హైకోర్టులో నారా లోకేష్ కేసుపై సుదీర్ఘ విచారణ కొనసాగింది. విచారణ అనంతరం లోకేష్‌పై ఉన్న స్కిల్ కేసును హైకోర్టు కొట్టివేసింది. స్కిల్ కేసులో అసలు లోకేష్‌ను తాము నిందితుడిగా చేర్చలేదని.. ముద్దాయిగా చూపని కారణంగా ఆయనను అరెస్ట్ చేయబోమని హైకోర్టుకు సీఐడీ చెప్పింది. ఒకవేళ తాము స్కిల్ కేసులో లోకేష్‌ను నిందితుడిగా చేరిస్తే 41-ఏ కింద నోటీసులు ఇస్తామని సీఐడీ వెల్లడించింది.
ఆనందంలో టీడీపీ.. ఆరోపణలు చేస్తున్న వైసీపీ
నారా లోకేష్‌కు బిగ్ రిలీఫ్ లభించడంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నాయి. నారా లోకేష్‌ను ఎలాగైనా కేసుల్లో ఇరికించి జైలకు పంపించాలని గట్టి పట్టుదలతో ఉన్న సీఎం వైఎస్ జగన్‌కు ఇది దిమ్మతిరిగే షాకేనని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. అంతేకాదు.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసులో కూడా లోకేష్‌కు అనుకూలంగా తీర్పు రావాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం త్వరలోనే ఊరట లభిస్తుందని ఆశిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయిన మరుసటి రోజే లోకేష్‌కు ఊరట లభించిందని.. ఇదంతా షా చలువేనని వైసీపీ విమర్శలు గుప్పిస్తున్నాయి.