Advertisement
Google Ads BL

పెద్దకాపు-స్కంద సీక్వెల్స్ ఉండనట్లే..


కొన్ని సినిమాలను ఒక్క పార్ట్‌లో చూపించలేక రెండు భాగాలుగా చేస్తున్నట్టుగా అనౌన్స్ చెయ్యడం, కొన్నిటికి సీక్వెల్స్ అంటూ మొదటి భాగం క్లైమాక్స్‌లో చెప్పడం ఈమధ్య కాలంలో చాలా చూశాము, చూస్తున్నాము. అయితే రీసెంట్‌గా ఒకరోజు అటు ఇటుగా విడుదలైన రెండు సినిమాలు సీక్వెల్స్ ప్రకటించాయి. సెప్టెంబర్ 28న విడుదలైన స్కంద సీక్వెల్ ఉంటుంది అని బోయపాటి ఎండ్ కార్డు వేశారు.

Advertisement
CJ Advs

ఇక శ్రీకాంత్ అడ్డాల ముందు నుంచి పెద్ద కాపు 1 అండ్ 2 అండ్ 3 ఉంటాయంటూ చెప్పాడు. మరి ఇప్పుడు ఈ రెండు సినిమాలకి సీక్వెల్స్ ఉండకపోవచ్చు.. ఎందుకంటే రెండు సినిమాల రిజల్ట్ కూడా మళ్ళీ సీక్వెల్స్ తీసేవిలా లేవు. స్కందకి గుడ్ టాక్ వచ్చినా.. ఆ సినిమా వీకెండ్‌తో వీకైపోయింది. పెద్దకాపు 1కి అయితే ప్లాప్ టాక్ వచ్చేసింది. స్కందకి కోట్లలో నష్టం వచ్చేలా ఉంది. ఇక శ్రీకాంత్ అడ్డాల పెద్దకాపు మూడు భాగాలంటూ చెప్పాడు.

అసలు మొదటి భాగాన్ని ప్రేక్షకులు పట్టించుకోలేదు. మరో భాగం తీస్తే కనీసం ఖర్చులు కూడా రావు. ఇక స్కంద రిజల్ట్‌తో బోయపాటి మరో సీక్వెల్ సాహసం చేయడు. సో స్కంద-పెద్దకాపు రెండు సినిమాలకి సీక్వెల్స్ అయితే ఇక ఉండకపోవచ్చని అభిప్రాయాలు గట్టిగానే వ్యక్తమవుతున్నాయి.

No Sequels to Skanda and Pedha Kapu:

Skanda and Pedha Kapu Ends with Part 1
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs