స్కంద ఓటిటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది


బోయపాటి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన స్కంద మూవీ గత నెల 28న విడుదలైంది. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి మొదటిరోజు మాస్ ఆడియన్స్ నుంచి మంచి టాకే వచ్చినా.. క్రిటిక్స్ మాత్రం స్కంద సినిమాని బాగా విమర్శించారు. అయితే మేకర్స్ స్కంద హిట్ అంటూ రోజువారి లెక్కలు చెబుతూ వచ్చారు. ఇక థియేటర్స్‌లో సెప్టెంబర్ 28న విడుదలైన స్కంద చిత్రం ఓటిటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది.

స్కంద విడుదలైన నెల లోపే అంటే నాలుగు వారాల్లోనే ఈ చిత్రం ఓటిటీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. డిస్ని ప్లస్ హాట్ స్టార్ స్కంద డిజిటల్ హక్కులని చేజిక్కించుకోగా.. ఈనెల 27 అంటే అక్టోబర్ 27 నుంచి డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చెయ్యాలని మేకర్స్ నిర్ణయించారని తెలుస్తుంది. ఈ విషయమై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది అంటున్నారు.

మరి స్కంద ఓటిటీ డేట్ వచ్చేస్తుంది అంటే.. థియేటర్స్ లో మిస్ అయిన మాస్ ప్రేక్షకులకి పండగే. అటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా స్కందని ఓటిటిలో చూసేందుకు ఇంట్రెస్టింగ్ గా స్ట్రీమింగ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడా డేట్ వచ్చేసింది. ఇక ఓటీటీలో మాస్ జాతరే. 

Skanda Movie OTT Release Date Fixed:

Skanda Movie OTT Streaming Details
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES